హైదరాబాద్ లో గాంధీ లు .. అడుగు అడుగున అపూర్వ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..!

0
1

హైదరాబాద్ వేదికగా  శని,ఆదివారం,  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,తో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రత్యేక విమానంలో  హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాయశ్రంల వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు పలువురు సీనియర్ నాయకులు   ఘన స్వాగతం పలికారు.  సిడబ్ల్యుసి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల నేతలు  హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరానికి తొలిసారిగా సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ కలిసి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేసింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్  నుండి సిడబ్ల్యుసి సమావేశాలు జరిగే హోటల్ వరకు  కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు

బంజారాహిల్స్ ని  తాజ్ కృష్ణ హోటల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొని అవకాశం ఉంది రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో పాల్ అంశాలు చర్చించే అవకాశం ఉంది ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు వివిధ రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితిని బట్టి ఏ విధంగా పొత్తుల చేసుకోవాలి ఎటువంటితో కలిసి పోటీ చేయాలి అనే అంశంపై సోకేర్కంగా చేతులు జరిపే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి  అనుసరించాల్సిన వ్యూహంపై కూడా  విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి (సీఎం) అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ జై రామ్ రమేష్ తదితరులు హాజరయ్యారు.  ఆదివారం సాయంత్రం నగర శివాలలోని తుక్కగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ హామీ ఇస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను సోనియా ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here