TT Ads

″హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతోంది . . మిగతా నగరాలతో పోల్చి చూసుకుంటే  భాగ్యనగరం లో అన్నీ నవర్గాలకు  పనులు దొరుకుతుండడం తో    ఉపాధి  నగరంగా మారింది   హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలే కాకుండా తెలుగు రాష్ట ల లోని  అన్నీ ప్రాంతాల తో పాటు  దేశం లోని వివిద ప్రాంతాలకు చెందిన ప్రజలు  వలస వస్తున్నారు. ఈ సంఖ్య ఎంత  పెరిగిందంటే వారానికి దాదాపు 15 వేల మంది పైగానే నగరానికి  వస్తున్నారు .దీనితో నగరం లో కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి.  ఇక్కడికి వచ్చిన తమ అడ్రస్ ప్రూఫ్ తేలిగ్గా మార్చేసిసుకుంటున్నారు . వచ్చిన వారిలో కొంత మంది , రాజకీయ నాయకులుగా ,రియల్ ఎస్టేటర్లుగా, స్వచ్చంద సంస్థ సంఘాలుగా,మహిళా సంఘాల ముసుగులో రక రకాల  అవతారాలు ఎత్తుతున్నారు .  స్థానికంగా అంతా కొత్త వారే ఉండడం తో  వీరి ఆగడాలకు అడ్డు  అదుపు లేకుండా పోతోంది   హైదరాబాద్ లో అభివృద్ది ఏ లెవెల్ లో జరుగుతుందో అక్రమాలు ,అన్యాయాలు ,మోసాలు ,అదే రేంజ్ లో పెరిగి పోతున్నాయి.  కొంత మంది మహిళలు మరి బరితెగించి పోతున్నారు.   మహిళా సంఘాలనే ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. సంఘాల చాటున అనేక అరచాకలకు పాల్పడుతున్నారు ఆధాయ  మార్గాల కోసం అనేక అడ్డ దారులు తొక్కుతున్నారు .  పోలీస్  స్టేషన్ కు   తమ సమస్యల  పరిస్కరం కోసం ఎవరైనా మహిళా పోలీస్  స్టేషన్  మెట్లు ఎక్క గానే వెంటనే వారికి   కాల్  వెళ్ళి పోతుంది . క్షణాల్లో  గద్దల్లా వాలి పోతారు . మెమున్నాం అంటూ వారికి భరోసా ఇస్తారు . వీళ్ళు రాగానే పోలీస్ లు  కూడా ఒక రేంజ్ లో రెస్పెక్ట్ ఇస్తారు.సదరు మహిళకు  నిజంగా అన్యాయం జరిగిందా లేదా అని ఏమి ఆలోచించరు . మీకు న్యాయం చేస్తాం కొంత డబ్బు ఇవ్వాల్సి వుంటుంది మేము తిరుగాల్సి వుంటుంది పనికోసం పై అధికారులకు ఇవ్వాల్సి వుంటుందని  నమ్మి స్తారు .ఇక కథ అక్కడినుండి  మొదలు పెడుతారు . బార్య భర్తల కేసు అయితే ఒక రేట్ ,ప్రేమికుల కేసు అయితే   మరో రేటు  ఉంటుంది , న్యాయం చేస్తున్నారు తప్పు లేదు గా మనకు అనిపించవచ్చు . కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది . నేరం మోప పడ్డ పురుషుల కుటుంబానికి చెందిన వారిని టచ్ చేస్తారు . మొత్తం మీద రెండు వైపులా నుండి డబ్బులు గుంజిన తర్వాత ఈ ఎపిసోడ్ ను మరింత లాగా తీస్తారు . క్షణాలో పరిష్కారమయ్యే కేసులను కౌన్సిలింగ్ పేరిట సాగా తీస్తారు . మీకు వచ్చిన డబ్బుల్లో మా వాటా ఇవ్వాల్సి వుంటుందని ముందే వ ఒప్పందం చేసుకుంటారు .ఇలాంటి ఎక్కువగా   నగర శివార్ల లో  స్టేషన్ లలో  ఎక్కువగా జరుగుతున్నాయి . హైదరాబాద్  లో  అన్నీ కమిషనరేటు  పరిధుల్లో ఇలాంటి కేసు లు ఉంటున్నప్పటికి   ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో  ఇలాంటి దండాలకు పాల్పడే వారి సంఖ్య మరి ఎక్కువగా కనిపోస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి . నిజంగా మహిళా హక్కుల కోసం  పోరాటం చేస్తున్న వారికి నకిలీ సంఘాల తో చెడ్డ పేరు వస్తుందని ఓ మహిళా నాయకురాలు ఆందోళన వ్యక్తం చేశారు . మహిళా సంఘాల పేరిట  నిత్యం పోలీస్ స్టేషన్ ల లో కనిపించే  మహిళ ల పై వారికి సహకరిస్తున్న పోలీస్ ల పై ఉన్నతాధికారులు  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *