TT Ads

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం చోటు చేసుకుంది, ప్రమాదంలో  8 మంది మృతి  చెందారు

వివరాల్లోకి వెళ్తే…నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో  8 మంది  మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు కూడా పెద్ద మొత్తంలో దెబ్బ తిన్నాయి. ..

కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు పని చేస్తున్నారు ఆది వారం ఉదయం 10 గంటలకు ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు పరిస్థితిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమీక్షించారు.

ఈ ఏడాది మే 16న తూర్పు మిడ్నాపూరం్ జిల్లా ఎగ్రాలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఆ ఘటనను మరకముందే మరో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *