TT Ads

గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ లో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని వైయస్సార్సీపి మైలవరం  ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు  ఈ సంఘటనను గోరంతల కొండంతలుగా చేసి మాట్లాడటం సబబుకాదనిఆయనవ్యాఖ్యానించారు. ప్రవాస ఆంధ్రుడైన ఉయ్యూరు శ్రీనివాస్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే జనవరి ఒకటో తేదీన కానుకల పంపిణీ చేశాడని అది తెలుగుదేశంతో కలిసి చేయడం వల్ల ఆయన మెడకు చుట్టుకుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.  ప్రవాస ఆంధ్రుల వల్ల దేశానికి ఎంతో ఉపయోగకరమని వారు చేస్తున్న సేవను ఎవరు తప్పు పట్టకూడదని ఆయన అన్నారు      శ్రీనివాస్ కూడా పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై బురద చల్లడం సరికాదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు . ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మిత్రుడు అని ఆయన వ్యక్తిత్వం గురించి తనకు బాగా తెలుసు అని  ఆయనకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో కాకుండా మరో వ్యక్తులతో కలిసి ఈ కార్యక్రమం చేసి ఉంటే ఆయన మీద ఇంత రాద్ధాంతం జరిగేది కాదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *