ముఖ్యమంత్రి కె. సి. ఆర్ గారు రైతు రుణాల మాఫీ ఎప్పుడు…? తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్

0
4

.రైతు పంట రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని సీఎం కెసిఆర్ చెప్పి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు .ప్రభుత్వ హామీ మేరకు బ్యాంకుల్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ నిధులు విడుదల చేసి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతు పంట రుణాలు మాఫీ చేస్తామని టిఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 36.68 లక్షల మంది రైతులకు 19,198.38 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రుణ మాఫీ కోసం 1148.38 కోట్లు విడుదల చేసి ఐదు లక్షల 66 వేల మంది రైతు రుణాలు మాఫీ చేసి మిగతా వారిని విస్మరించారని ఆరోపించారు. 31 లక్షల మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు

.ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వస్తుందన్నారు. నాలుగు సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగి డబ్బులు చెల్లించకపోవడంతో రైతుల ఖాతాలను NPA లో పెట్టారని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని. తక్షణమే బ్యాంకులకు రుణమాఫీకి నిధులు విడుదల చేసి బ్యాంకు లో ఉన్న పాస్ పుస్తకాలు రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here