తెలంగాణలో ఇప్పటీకిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పోల్ పల్స్ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై నియోజక వర్గాల వారీగా వివరాలు అందించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు ఆ సంస్థ పేర్కొంది . తెలంగాణ సిఎం కేసిఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత అసహనం స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అదేవిధంగా ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాలు, నిరుద్యోగ సమస్య లతో యువత వ్యతిరేకంగా ఉంది. మైనార్టీ ,దళిత వర్గాల్లో కూడా మోడీ సర్కార్ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలో వెల్లడించింది.. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పస్ల్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. పోల్ పల్స్ గ్రూప్ సంస్థ అందించిన వివరాల ప్రకారం
జహీరాబాద్ ,చేవెళ్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది
. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది
.బిఆర్ఎస్ భాగస్వామి వామ పక్షాల తో కలిసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం పెద్దపల్లి స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.
ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కే పరిమితం అవుతుందని తెలిపింది.
కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పడిపోనున్నట్లు పోల్ పల్స్ గ్రూప్ సంస్థ సర్వే రిపోర్టులో పెర్కొంది.
పెద్దపల్లిలో బిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బిఆర్ఎస్ కి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందని పోల్ పల్స్ గ్రూప్ వెల్లడించింది