అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో పులుల అభ‌యార‌ణ్యాల్లో ఎకో టూరిజంగా ఈ ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తున్నాం… మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి

0
6

*వరల్డ్ వైడ్ ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్ఫ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ చారిటీ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ లో బాగంగా అటవీ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న పలువురిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ట్రోపీలను అందజేశారు.

 

హైటెక్ సిటీ సమీపంలోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ వైడ్ ఫండ్ ట్రస్టీ , చైర్మన్ అనిల్ కుమార్ ఎపురీ, స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్, తదితరులు పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసనకార్యక్రమాల గురించి వివరించారు.*పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి, కానీ భారతదేశంలో జనాభా విస్ఫోటనం వల్ల వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరికరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టుల‌ నిర్మాణం, రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాల వల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. దీంతో పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలుగుతుంది. అడవులు తరిగిపోవడంతో పాటు వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసీఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని సమగ్ర అడవుల పరిరక్షణ, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌, జీవ వైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం దేశంలో ఎక్క‌డ లేని విధంగా వినూత్న కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు.

తెలంగాణ అడ‌వుల్లో ఆవాసం ఉన్న వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షించ‌డంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ “తెలంగాణకు హరితహారం” కార్య‌క్ర‌మంలో భాగంగా 230 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా, ఆ ల‌క్ష్యాన్ని అధిగ‌మించి, 270 కోట్ల‌కు పైగా మొక్క‌ల‌ను నాటాము.

తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగింది.

ఇతర రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాం. మన హైదరాబాద్ రెండు సార్లు ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గా, తాజాగా వ‌ర‌ల్డ్ గ్రీన్ సిటీగా గుర్తింపు పొందింది. లివింగ్ గ్రీన్ కేటగిరి కింద.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుద్దరణ చర్యల వల్ల అడవుల్లో పర్యావరణం, జంతుజాలం బాగా వృద్ది చెందింది. అమ్రాబాద్‌, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఏరియాల్లో పులుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.

పులుల అభ‌యార‌ణ్యాల్లో పెద్ద పులులు స్వేచ్చ‌గా సంచ‌రించేందుకు, స్థిర ఆవాసానికి అనువుగా మార్చేందుకు కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల ప్ర‌జ‌ల‌ను మైదాన ప్రాంతాల‌కు త‌ర‌లించి, వారికి మెరుగైన పున‌రావ‌సం క‌ల్పిస్తున్నాము. .

టైగ‌ర్ రిజ‌ర్వ్ ఏరియా, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కేంద్రాల వ‌ద్ద పులులు, ఇతర వన్య‌ప్రాణుల సంచారానికి ఆటంకాలు కలుగకుండా అవి స్వేచ్చ‌గా సంచ‌రించేందుకు ఎకో బ్రిడ్జి (పర్యావరణ వంతెన) ల నిర్మాణాలకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.

అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో పులుల అభ‌యార‌ణ్యాల్లో ఎకో టూరిజంగా ఈ ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ‘టైగర్ స్టే’ పేరిట సఫారీ టూర్ అందుబాటులోకి తెచ్చాం.

ఎకో టూరిజం ప్రాజెక్ట్ లో స్థానిక చెంచుల‌తో పాటు స్థానిక‌ ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాములను చేసి వారికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. దీని వ‌ల్ల సుమారు 50 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

వనాలు పెరగాలి.. కోతులు ఆ వనాలకు తరలాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా నిర్మ‌ల్ జిల్లా కేంద్రానికి స‌మీపంలో చించోలి (బి) లో దేశంలో రెండ‌వ‌ది- రాష్ట్రంలోనే మొద‌టిదైన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాం.

అడవులను పెంపోందించ‌డంలో సహాయపడే మరియు ఈ అడవులలో నివసించే ఆదివాసీల‌కు మద్దతు ఇచ్చే వినూత్న కార్యక్రమాలను చేపట్టే WWFకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..

జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతను మ‌నమంద‌రం గుర్తించాల‌ని తెలియ‌జేస్తున్నాను. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృధ్ధిచేయడం, జంతువులపట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం, ఈ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం అవసరం, అనివార్యం. అని  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here