Telangana State Election..ప్రింట్,ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా న్యూస్ పై నిఘా వేసిన EC

0
12

ప్రింట్ మరియు , ఎల‌క్ట్రానిక్ మీడియా  వ‌చ్చే వార్త‌లు,సోషల్ మీడియా విశ్లేష‌ణ‌లకు డ‌బ్బులు చెల్లించ‌డం లేదా ప్రలోభాలకు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని పెయిడ్ న్యూస్‌గా ఎంసిఎంసి క‌మిటీ గుర్తిస్తుంది. ప‌లు పార్టీలు, అభ్య‌ర్థులు మీడియా ద్వారా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా వ్య‌క్తిగ‌త ప్ర‌చారాలకు సంబంధించి పెయిడ్ న్యూస్‌లు ఇటీవ‌ల కాలంలో ఆందోళ‌న‌క‌ర స్థాయిలో ఉన్నాయని ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తించింది.

క్షేత్ర‌స్థాయిలో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా ఉన్న ఈ పెయిడ్ న్యూస్‌లను అరిక‌ట్ట‌డానికి ప్ర‌త్యేకంగా పెయిడ్ న్యూస్ నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ను ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మీడియా మానిట‌రింగ్, స‌ర్టిఫికేష‌న్ క‌మిటి పెయిడ్ న్యూస్‌ల‌ను గుర్తించి రిట‌ర్నింగ్ అధికారుల ద్వారా సంబంధిత అభ్య‌ర్థికి నోటీసులు జారీచేస్తుంది. ఈ పెయిడ్ న్యూస్‌కు సంబంధించి స‌మాచార శాఖ అందించిన రేట్ కార్డును అనుస‌రించి వాటికి అయ్యే వ్య‌యాన్ని లెక్కించి అభ్య‌ర్థుల ఎన్నిక‌ల వ్య‌యంలో జ‌మ చేయ‌డానికిగాను ఆర్‌.ఓ ద్వారా నోటీసులు జారీచేస్తారు. ఈ నోటీసు ప్ర‌తిని ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కుల‌కు కూడా అంద‌జేస్తారు. ప‌త్రిక‌ల్లో లేదా టి.వి ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మైన పెయిడ్ న్యూస్ వ్య‌యాన్నిత‌మ ఎన్నిక‌ల వ్య‌యంలో ఎందుకు క‌ల‌ప‌రాదో కోరుతూ 96 గంట‌ల్లోగా సంబంధిత అభ్య‌ర్థికి రిట‌ర్నింగ్ అధికారి నోటీసులు జారీచేస్తారు. పెయిడ్ న్యూస్‌పై రిట‌ర్నింగ్ అధికారి జారీచేసిన నోటీసుల‌కు సంబంధిత అభ్య‌ర్థులు 48 గంట‌ల్లోగా స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల స‌మాధానానికి ఎంసిఎంసి క‌మిటి సంతృప్తి చెంద‌న‌ట్లైతే అట్టి వ్య‌యాన్ని అభ్య‌ర్థుల ఎన్నిక‌ల వ్య‌యంలో క‌లుపుతారు. అయితే ఎంసిఎంసి నిర్ణ‌యాన్ని రాష్ట్ర స్థాయి ఎంసిఎంసి క‌మిటి రెఫ‌ర్ చేసే అవ‌కాశం అభ్య‌ర్థికి ఉంటుందన్నారు.

 అన్ని న్యూస్ ఛానెళ్ల ప్రసారాల రికార్డింగ్ :

వివిధ వార్తా ఛానెళ్లలో వచ్చే వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలియచేశారు. అన్ని ప్రధాన ఛానళ్లు హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిచే ప్రచారాలకు సంబంధించి రికార్డింగ్ చేపట్టామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రో స్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here