TT Ads

మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. దేశ వ్యాప్తంగా ఖరీదైన ఎన్నికగా అందరి దృష్టిని ఆకర్షించిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 93.13% పోలింగ్ నమోదు కావడం కొత్త రికార్డుగా నిలిచింది. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో 91.65శాతం పోలింగ్ నమోదుకాగా, మునుగోడు లో 91.07శాతం పోలింగ్ నమోదైంది.

తాజా ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి లో 93.13శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం ఓటర్లు 2,41,805 మందికి ఉప ఎన్నికల్లో 2,25,192మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత.. తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు.

12,1672మంది పురుష ఓటర్లలో 11,3853 మంది, 12,0126 మంది మహిళా ఓటర్లకు 11,1338 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఏడుగురికి ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *