కారు నడిపిన కవకుంట్ల కవిత..

0
2

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌గా మారారు. తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన ఆమె కాసేపు కారు నడిపారు. అంబాసిడర్ కారులో బయలుదేరిన క‌విత కారును స్వయంగా నడిపారు. తాను కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియోను, ఫోటోలను కవిత సోషల్ మీడియా లో షేర్ చేశారు.’దూసుకెళ్తున్న కారు… రాబోయేది మ‌ళ్లీ కేసీఆర్ స‌ర్కారు… హ్యాట్రిక్ సీఎం కేసీఆర్’ అని ట్వీట్ చేశారు. గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పథకాలు చూసిన ప్రజలు మరోసారి ఆయనను గెలిపిస్తారని క‌విత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వరుసగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి రికార్డ్ సృష్టిస్తారన్నారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్ల గెలుపు ఖాయమన్నారు.

నిజామాబాద్ పట్టణం ఆనాడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనే ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ ఉన్న‌ శాంతిభద్రత కారణంగా అంతర్జాతీయ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చాయన్నారు. 54 ఏళ్లు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఆరుసార్లు బీజేపీకి అవకాశమిస్తే వారు కూడా ఏమీ చేయ‌లెద‌ని క‌విత విమ‌ర్శించారు.. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here