చివరి నిమిషంలో తారు మారైన అభ్యర్థుల జాతకాలు….బోరున విలపించింన పటేల్ రమేష్ రెడ్డి..!

0
10

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్ఠానం టిక్కెట్ కేటాయించింది. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు పని చేస్తే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ రాకపోవడంపై పటేల్ రమేశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగధీష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌ను ఓడించేందుకే తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ట‌నంపై హ‌ట్ కామేంట్స్ చేశారు. తనకు సీనియర్ నేతల వల్లే టిక్కెట్ రాలేదన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు. సూర్యాపేట్‌లో చిన్న పిల్లలను అడిగిన గెలిచేది ప‌టేల్ రమేష్ రెడ్డి అని చేబుతార‌న్నారు. సర్వేల్లో కూడా ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌న్నారు. కార్యకర్తల కోరిక మేర‌కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వెస్తున్న‌న‌ని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కుమ్ముకై నాకు టికెట్ ఇవ్వ‌లేదని ఆయ‌న ఆరోపించారు. 2018లో జరిగిందే తనకు మళ్లీ పునరావృతమైందన్నారు. ఇన్నాళ్లు పార్టీని కాపాడుకుంటే తనకు టిక్కెట్ దక్కలేదన్నారు. కుట్రపూరితంగానే తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. జిల్లాకు చెందిన పెద్ద నాయకుడు ఒకరు… జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు తనకు రాకుండా చేశారన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సూర్యాపేటలో తుంగతుర్తికి చెందిన కాంగ్రెస్ నేతల పెత్తనం ఎక్కువైందన్నారు.

చివరి క్ష‌ణంలో మారిన క్యాండెట్స్

చివరి క్ష‌ణంలో ప‌లువురు క్యాండెట్స్ ను ఆయా పార్టీలు మార్చాయి. వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్చి షాక్ ఇచ్చింది బీజేపీ. తొలుత వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి తుల ఉమ, సంగారెడ్డి నియోజకవర్గానికి రాజేశ్వరరావు దేశ్‌పాండేకు టిక్కెట్ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ వారికి… టికెట్ నిరాక‌రించింది. వేములవాడ నుంచి మాజీ గవర్నర్ విద్యాసాగర రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు, సంగారెడ్డి నుంచి పులి మామిడి రాజుకు బీ ఫామ్‌లు ఇచ్చి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చింది. నారాయణఖేడ్ నుంచి తొలుత సురేష్ షేట్కార్ పేరును ప్రకటించింది. అ త‌ర్వాత సంజీవ్ రెడ్డికి భీపాం ఇచ్చింది. షేట్కార్‌కు లోక్ సభ సీటు హామీ ఇచ్చింది. సురేశ్ షేట్కార్, సంజీవరెడ్డిలతో మాట్లాడి ఇద్దరి మధ్య అధిష్ఠానం సయోధ్య కుదిర్చింది.. సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు చివరకు దామోదర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. టిక్కెట్ రాకపోవడంతో పటేల్ రమేశ్ రెడ్డి అధిష్ట‌నంపై పైర్ అయ్యారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఇవాళ్ల చివ‌రి రోజు కావ‌డంతో అభ్య‌ర్థుల‌లో ఆందోళ‌న మొద‌లైంది. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిర్పూర్‌లో బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొత్తగూడెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంకటరావు, హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి జోరు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి ఆయన కామారెడ్డికి చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లిన రేవంత్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. రేవంత్ నామినేషన్ దాఖలు కు క‌ర్నాట‌క సీఏం సిద్ధరామయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్ణాటక మంత్రి బోస్ రాజు తో పాటు ప‌లువురు నేత‌లు ఉన్నారు. కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బుతోనే రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6న తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు.గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here