కాంగ్రెస్ పార్టీ జపం చేస్తున్న కేకే కుటుంబం.. !!

0
5

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నోట‌ కాంగ్రెస్ మాటే వినిపిస్తోంది… కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేత‌లు ఎవరైనా సరే పదే పదే కాంగ్రెస్ పార్టీ జ‌పం చేస్తున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుందని నెగెటివ్ క్యాంపెన్ చేస్తున్నారు కేసీఆర్. దీని కోసం ఆయన డైర‌క్ట్‌గా కాంగ్రెస్ గెలిస్తే అని అంటున్నారు. కేటీఆర్ కూడా అంతే సేమ్ టూ సేమ్ . కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెంచి ..బీఆర్ఎస్‌కు లాభం చేయాల‌ని చూస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అరాచకమేనని బీఆర్ఎస్ ఎందుకు ప్రచారం చేస్తోంది ? ఈలాంటీ నెగెటివ్ క్యాంపెన్ వర్కవుట్ అవుతుందా ? కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో భయాందోళన పెంచితే బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా ?

కాంగ్రెస్ పార్టీ పై నెగెటివ్ క్యాంపెన్ చేసి ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తే జ‌నం తమకే ఓట్లేస్తారన్న వ్యూహాన్ని బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ రాదని.. పథకాలు ఆగిపోతాయని.. పరిశ్రమలు తరలి పోతాయని జ‌నం చెవుల్లో గుడి క‌ట్టుకొని ఉద‌ర కొడుతున్నారు. రేవంత్ రెడ్డి .. చంద్రబాబు మనిషని, బాబు చేప్పిందే చేస్తాడంటూ ప్ర‌చారం చేస్తున్నారు. రేవంత్ పైన .. కాంగ్రెస్‌పైన తెలంగాణ వ్యతిరేకులు అనే ముద్ర వేసి మళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తోంది బీఆర్ఎస్. ఎక్క‌డ ప్రచారసభ జ‌రిగిన ఇదే హైలెట్ చేస్తున్నారు. కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారంటూ ఉద‌ర కొడుతున్నారు. కర్ణాటకలో కరెంట్ స‌క్ర‌మంగా ఇవ్వ‌టం లెద‌ని, అక్కడ హామీలు ఏమీ స‌రిగా అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. డీకే శివకుమార్ రాసినట్లుగా చెబుతున్న లేఖను వైరల్ చేయడంతో దుమారం రేగింది. కాంగ్రెస్ గెలవక ముందే హైదరాబాద్ పరిశ్రమల్ని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక గెలిస్తే.. హైదరాబాద్ ను ఖాళీ చేసి బెంగళూరుకు తరలిస్తారని ఆరోపించడం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషించడం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గుర్తుంచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలు బాగానే అమలయ్యాయి. రేషన్ కార్డులు, పించన్లు అడిగిన వారందరికీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి పార్టీ నష్టపోయిందన్న భావనలో కొంత మంది సానుభూతిపరులు ఉన్నారు. కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోవడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. చివరికి తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని.. అందరం కలిసి ఉద్యమం చేస్తే తప్పని సరి పరిస్థితుల్లో ఇచ్చిందని వాదిస్తున్నారు బీఆర్ఎస్ నేత‌లు.
కేసీఆర్, కేటీఆర్ మాటలతో… కాంగ్రెస్ పార్టీకి ప్ల‌స్ అవుతోంద‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని అంటున్నారు. నమ్ముతారో లేదో.. డిసెంబర్ మూడో తేదీన క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here