డిజిపి ఎం మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాదులోని లకిడికాపూల్ హోం మంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్య్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను హోం మంత్రి డిజిపి కి బహూకరించారు
.ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీమాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డిజిపిగా నూ, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారని హోం మంత్రి ప్రశంసించారు. ఐదు సంవత్సరాల కు పైగా డి జి పి గా పనిచేసి మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖ ను అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అడిషనల్ డి జి పి లు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.