
*ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా
*తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
*కేసీఆర్ నాకు పితృ సామానులు,,,ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తా
*కొత్తగూడెం వనమహోత్సవ వేడుకలో డీహెచ్ గడల
ఇటీవల ప్రగతి భవన్ లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభ కార్యక్రమంలో డీహెచ్ గడల శ్రీనివాస రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం చేసిన విషయం విదితమే
మారుమూల ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి ప్రారంభించిన శుభ సందర్భం లోనే కొత్తగూడెం జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ తాను పాదాభివందనం చేసానని గడల ఇప్పటికే ప్రకటించారు
ఐతే కొందరు కావాలని పనిగట్టుకుని ఈ విషయం పై రాద్ధాంతం చేయడం పట్ల కొత్తగూడెం పట్టణం లో ఆదివారం జరిగిన మున్నూరు కాపు వన భోజనాల వేడుక సాక్షిగా గడల స్పందించారు
ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపితగా
బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పరిపాలనాదక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పితృ సమానులుగా భావిస్తానని తెలిపారు
కెసిఆర్ తో ఫోటో దిగడం ఆయన పాద పద్మాలను తాకడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తా అనే విషయాన్ని కోవిడ్ సమయంలోనే అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించిన విషయాన్ని గడల గుర్తు చేశారు
గిరిజన ప్రాంతం నుండి మెడిసిన్ చదివేందుకు హైద్రాబాద్ వచ్చిన సందర్భంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు నేటి తరానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు రాకుండా చేసిన సీఎం కేసీఆర్ కి మరోమారు వందనాలు తెలుపుకుంటున్నానని ఈ సందర్భంగా డీహెచ్ గడల శ్రీనివాస రావు ప్రకటించారు
భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కిందని గడల గుర్తుచేశారు
ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చెస్తున్న యజ్ఞం లో భాగస్వామ్యులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని గడల శ్రీనివాస్ రావు తెలిపారు