
గణేష్ ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా మొదలయ్యాయి .తెలంగాణ మొత్తం మీద లక్షకు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు . ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 35 వేల వినాయాక మండపాలు ఏర్పాటు చేశారు.రాష్టమ లోనే అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందిన ఖైరతా బాద్ గాన నాధునికి సోమవారం తెలాంగణ రాష్ట గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ దర్శించుకొని కుటుంబ సబ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు . తొలి పూజ కార్యక్రమం లో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తో పాటు మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ ,స్తానీక ఎమ్మేల్యే దానం నాగేందర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిదులు ,అధికారులు పాల్గొన్నారు .
ఈ సందర్బంగా గవర్నర్ తమిళసై మాట్లాడారు . రాష్ట ప్రజలు గణేష్ ఉత్సవాలాను ఆనందంగా జరుపుకోవాలని కోరారు . గణనాధుడు ప్రజల కష్టాలు తొలిగించే తొలిగించే దేవుడని ఆమె కొనియాడారు . తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంటప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు . ఎన్నో ఏండ్లుగా ఖైరతా బాద్ లో పర్యావరణాన్ని కాపాడుతూ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనియమని గవర్నర్ తమిళ్ సై అన్నారు
.