TT Ads

తెలంగాణలో  సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ  కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్,బి. జె. పి. బి ఆర్ ఎస్ పార్టీ లు అధికారం లోకి రావడానికి సర్వ శక్తులు వడ్డుతున్నాయి .

సర్వ శక్తులు  ఒడ్డుతున్న బి.ఆర్.ఎస్ 

ఈ  ఎన్నికల రేసు లో  రెండు టర్మ్స్ లు అధికారంలో ఉన్న బి.ఆర్ఎస్ పార్టీ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడానికి సర్వ శక్తులు  ధార పోస్తోంది .  ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు అందరికంటే ముందుగా ఎన్నికల రేసులో    తమ గెలుపు గుర్రాలను  ప్రకటించారు.  . తమ పార్టీ లో ఉన్న క్యాడర్ జారిపోకుండా  ప్రయత్నిస్తూనే వివిధ పార్టీ లకు చెందిన నాయకులను, క్యాడర్ ను  తవైపు తిప్పుకునేందుకు సర్వ శక్తులు.ధారపోస్తున్నారు.. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ గనుక పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ప్రసన్న చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

.2014 ఎన్నికలు పూర్తి గా సెంటిమెంట్ తో కూడుకున్నాయి కావడం తో ఓటర్లు సహజంగానే తెలంగాణ సెంటీమేట్ కు పట్టం కట్టారు.  ఇక 2018  ఎన్నికలు వచ్చేసరికి బి ఆర్ ఎస్ తన వ్యూహాన్ని మార్చేసింది . కొన్ని రోజుల్లో ఎన్నికలకు వెళ్తాం అనే ముందు   రైతు బంధు వంటి స్కీమ్ తీసుకు రావడం దాని తో పాటు  వృద్దులకు,అంగవైకల్యం, ఒంటరి మహిళలకు,పెన్షన్ లు  పెంచుతూ కొత్త పెన్షనులు  ఇవ్వడం ,కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణం తో పలు జల వనరుల ను పెంచే ప్రాజెక్టు లు నిర్మించడం ఆ పార్టీ కి బాగా కలిసివచ్చింది . ఆ ఎన్నికల్లో తెలంగాణ నినాదాన్ని కే సి ఆర్ కొత్త రూపం లో ఎత్తుకోవడం ఆయన కు బాగా  నాయుడు కాంగ్రెస్స్ తో జత కట్టడం ఇష్టం లేని వర్గాలకు కెసిఆర్ మాటలు నిజమే అనిపించాయి.

ఎప్పటినుండో కాంగ్రెస్స్ ఓటు వేస్తున్న వర్గాలు కూడా కాంగ్రెస్స్ కూతమిని వ్యతిరికించాయి .    చంద్ర బాబు నాయుడుకి  తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని మరో సారి తెలంగాణ  సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చింది . టి ఆర్ ఎస్ పార్టీ  బీఆర్ఎస్ పార్టీ గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాదని తేలిపోవడం తో బి ఆర్ ఎస్ అధినేత  తన రూటను మార్చారు  .  ఈ  ఎన్నికల్లో   ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడానికి అభివృద్ది,సంక్షేమ  పదకాలతో కే సి ఆర్ ముందుకు వెళ్తున్నారు 

బి.ఆర్.ఎస్ దీటుగా కాంగ్రెస్ వ్యూహాలు..

 ప్రత్యేక తెలంగా రాస్తాన్ని ఇచ్చింది కాంగ్రెస్స్  పార్టీయే   ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ  స్టేట్  లో  పార్టీ ని నడిపించే  శక్తి లేకపోవడం తో దాదాపు దశాబ్ది కాలం నుండి అధికారానికి  దూరంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్స్ పార్టీ నుండి  విజయం సాదించిన ప్రజా ప్రతినిదులు పార్టీ ని విడిచిపెట్టి బి ఆర్ ఎస్ కు వెళ్ళిపోవడం మరికొంతమంది నాయకులు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ లో చేరిపోవడం తో  తెలంగాణ లో కాంగ్రెస్ బాగా బాలహీనపడింది . ఒక దశలో ఎన్నికల్లో పోటీచేయడానికి  క్యాండియట్  లు కూడా లేని పరిస్తితి ఏర్పడింది .కానీ  ప్రదేశ్ కాంగ్రెస్  కెమిటి  అద్యక్షుడిగా రేవంత్   రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ సినారియో మారిపోయింది

 ఆ పార్టీ క్యాడర్ లో  లో కొత్త జోష్ వచ్చింది . కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తో తెలంగాణలో గ్రాఫ్ అమాంతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ని విడిచి వెళ్ళిపోయిన వారితో పాటు వివిద పార్టీ ల కు చెందిన ముఖ్య  నాయకులు,పెద్ద  ఎత్తున   వచ్చి చేరుతున్నారు 

సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ BRS పార్టీని ఓడించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేసులో ముందుండగా కాంగ్రెస్ పార్టీ  వ్యూహాత్మకంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. దాన్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించింది. వర్గాలవారీగా అభ్యర్థులకు రుసుం విధించింది 119 నియోజకవర్గాల్లో మొత్తం దాదాపు 1100 అప్లికేషన్లు వచ్చాయి. నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని దానిపై వడపోత ప్రారంభించింది . కొన్నాళ్లుగా సునీల్ కనుగోలు నేతృత్వంలో అభ్యర్థుల గెలుపు ఓటమిపై విస్తృతమైన సర్వే నిర్వహిస్తున్నారు అదేవిధంగా న్యూఢిల్లీ కి చెందిన మరో రెండు సర్వే సంస్థలు లోకల్ క్యాడర్ కు సంబంధం లేకుండా నియోజకవర్గాల వారీగా సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ అంద చేస్తున్నారు .కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయిన మైనార్టీలు దళితుల ను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు పకడ్బందీ  ప్లాన్ చేస్తున్నారు

ఉద్యోగ అవకాశాలు లేని యువతను ఆకర్షించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు అదే విదంగా  గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు రైతులు, రైతు కూలీలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు కసరత్తులు చేస్తోంది . టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దీటుగా పలు పధకాలు  తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.   ఎన్నికల్లో తమ హామీలను ప్రజలకు వివరించేందుకు అగ్ర నాయకుల తో  సమావేశాలు నిర్వహించాలని రంగం   సిద్ధం చేస్తుంది. 

తెలంగాణలో   వికాసం కోసం కమలం  ఎత్తులు…

ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. ఇప్పటికే.. సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. ఈ క్రమంలోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుకు ఎటువంటి రుసుము విధించకపోవడంతో ఒక్కొక్కరు ఐదు నుంచి పది స్థానాల్లో టిక్కెట్ను ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు

  బీజేపీలో అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సంప్రదాయాన్ని అమలు చేసిన కమలం పార్టీ అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో వడపోత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్నికల్లో సీనియర్ ఎవరు దరఖాస్తు చేసుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి అప్లికేషన్ పెట్టుకున్న వారిలో ఎక్కువ శాతం గెలిచే అవకాశం లేనివారే కనిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీ ల మద్య జరిగే  ఎన్నికల యుద్దం లో అధికార పార్టీ కి అవకాశాలు అంతగా కనిపించడం లేదని పలు సర్వే సంస్థలు చెపుతున్నాయి . కాంగ్రెస్స్ పార్టీ కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . బి జె పి  బి ఆర్ ఎస్ రెండు ఒక్కటే అనే భావన సామాన్య ప్రజల్లో కూడా ఉందని అంటున్నారు . భారతీయ జనతా పార్టీ బలహీన పడడం ,చాలా కాలం నుండి రాష్టమ లో కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న తిరిగి  హస్తం తో జత కట్టడం  కాంగ్రెస్ కు  కలిసి వస్తోందని రాజకీయ పరిశీలకులు   భావిస్తున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *