TT Ads

పార్టీల‌కు శ్ర‌వణా నందం

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలకు మంచి రోజులు వచ్చేశాయ్… అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తొలి జాబితా రెడీ అయిందంటూ లీకులు మీడియాకు వస్తున్నాయి. ఇంతకాలం చేరికలు, వ్యూహ-ప్రతివ్యూహాలు, గెలుపు గుర్రాల అన్వేషణపై కసరత్తులు చేసిన రాజకీయ పక్షాలు ఇకపై వాటికి కార్యరూపం దాల్చబోతున్నాయి. కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు అనుకూలమైన మంచి రోజులు వచ్చేశాయి. శ్రావణమాసం మొదలైంది. దీంతో అసలు సిసలైన రాజ‌కీయ‌ పోరు ఇక మొదలుకానుంది. అక్టోబర్ చివరి నాటికల్లా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే అంచనాలున్నాయి. ఈ లెక్కన చూస్తే పార్టీలకు రెండున్నర నుంచి మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ముక్కోణ పోరులో తలపడబోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తోపాటు ఇతర పార్టీలు కూడా ఎన్నికలే లక్ష్యంగా పోలిటీక‌ల్ వార్‌కు రేడీ అవుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో తొలి జాబితా సందడి కనిపిస్తోంది. వచ్చే వారమే ఎన్నికల నోటిఫికేషన్ అన్నంత కంగారు పడిపోతున్నాయి. అభ్యర్థుల జాబితాలను వడపోస్తున్నాయి. ప్రచార కార్యక్రమలను జోరుగా నిర్వహిస్తున్నారు షెడ్యూల్ ప్రకారం అయితే.. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ లో షెఢ్యూల్ ఉంటుంది. అయినా ముందుగానే రాజకీయ పార్టీలు తొలి జాబితా గురించి ప్రకటనలు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలపై దృష్టిసారించిన ప్రధాన పార్టీలన్నీ త్వరలోనే అభ్యర్థుల ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అసంతృప్తులకు ఆజ్యం పోయకుండా పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. జాబితా కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 18న శ్రావణ మొదటి శుక్రవారం లేదా ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలింది. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, వీరిలో కాంగ్రెస్ , టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన‌ వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కూడ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు అభ్యర్ధులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. కర్ణాటక ఎన్నికల జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని చెబతున్నారు. కొంత మంది పేర్లతో ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఓ జాబితాను విడుదల చేస్తే అసంతృప్తులను బుజ్జగించేందుకు సమయం ఉండటంతో పాటు విస్తృత ప్రచారానికి సమయం దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ.. తమను ఢీకొట్టే సత్తా బీజేపీకి లేదని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ అదంతా పైపైకేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోలోన ఆ పార్టీ కలవరపాటుకు గురవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రూపంలో ముప్పుపొంచివుందని గ్రహించిన గులాబీ దళపతి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నారట. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ఈసారి ప్రజావ్యతిరేకత తప్పదనే అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నాయట. తేడా వ‌స్తే అధికారం చేజారిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే వీలైనన్ని కొత్త‌ ప‌థ‌కాల‌తో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, ఇండ్ల పంపిణీ చేప‌ట్టారు.

క్షేత్రస్థాయిలోనూ బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోందట. ముఖ్యంగా కొన్ని పథకాల్లో స్వయంగా ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం చేటు చేస్తుందేమోనని భయం పట్టుకుందట. సిట్టింగుల్లో పలువురికి సీట్లు దక్కడం కష్టమేననే…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *