TT Ads

బదిలీల ప్రక్రియలో ఏ ప్రాతిపదికన టీచర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా? అని నిలదీసింది. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చినట్టు తెలిపారు. బదిలీలకు సంబంధించి నిబంధనలను సవరించామని.. వాటిని అసెంబ్లీ కౌన్సిల్‌ ముందు ఉంచినట్లు కోర్టుకు వివరించారు. ఈ మేరకు నిబంధనల మార్పులపై ఏజీ కోర్టుకు మెమో సమర్పించారు. స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఎన్నికలు వస్తున్నందున త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ.. మెమో, కౌంటర్లు ఇవాళే ఇచ్చినందున కొంత సమయం కావాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 23న బదిలీలపై వాదనలు వింటామని తెలిపింది._*

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *