హైదరాబాద్‌ పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ పడగా విప్పింది. లంగర్ హౌస్ లో మంగళవారం సాయంత్రం ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని సమీపం లోని రాజేంద్ర నగర్ లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్లి బట్టలు విప్పదీసి విపరీతంగా కొట్టినట్లు ఇర్ఫాన్ తెలిపాడు .తమ మాట వినక పోయిన,ఎదురుతిరిగిన ఇదేవిదంగా శిక్షిస్తామని గ్యాంగ్ వార్ హెచ్చరించినట్లు అతను తెలిపాడు. తాను వారి నుండి తప్పించుకొని రావడం వల్ల బ్రతికిపోయానని లేకపోతే చనిపోయేవాడినని ఇర్ఫాన్ వాపోయాడు .ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు