మా విధానం సమైక్య రాష్ట్రమేనని  A.P.   రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో  ప్రభుత్వ సలహాదారుడు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాగలిగితే ముందుగా స్వాగతించేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే: అని అన్నారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రస్తావిస్తున్న  కేసు 2014 విభజన చట్టంపై వేసిన కేసుగా నేను భావిస్తున్నా. విభజన చట్టం అసంబద్ధం అనే అంశంపై కేసు వేసినట్లున్నారు. ఇంతకాలం తర్వాత, నిన్ననే ఆయన ఎందుకు రియాక్ట్‌ అయ్యారన్నది నాకూ అర్ధం కావడం లేదు. సాంకేతికంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భావం స్ఫురించేందేమో అనుకోవాల్సి వస్తుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూల్‌ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా పార్టీ అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే కుదిరితే అందరం కలిసి రావాలని, ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రాక్టికల్‌గా ఇంత దూరం వచ్చిన తర్వాత పెండింగ్‌ అంశాలపై ఫైట్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి మాటలు కొన్ని అసందర్భంగా ఉన్నట్లు, పనిగట్టుకుని జగన్మోహన్‌ రెడ్డి గారిని విమర్శించారని అనిపించింది. ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీజేపీ. వారికి సహకరించి టీడీపీ అన్యాయం చేస్తే, చివరి నిమిషం వరకూ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఒక్క  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో భజన జరిగిన తర్వాత విభజన హామీల కోసం మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. దౌత్యపరంగా, కోర్టుల్లో ఉన్న అంశాలపై పోరాటం చేస్తుంది మా పార్టీనే. ఉండవల్లి గారికి ఆ అనుమానం ఎందుకు వచ్చిందో కానీ మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిది ఒకటే  విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసిన అంశంపై మాకు బాధగానే ఉంది. మాకంటే బలంగా జగన్మోహన్‌రెడ్డి గారికి ఆ బాధ ఎక్కువగా ఉంది. ఎక్కడ అవకాశం వచ్చినా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాగలిగితే ముందుగా స్వాగతించేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే.

– విభజన హామీలనైనా మరింత మెరుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానిది…ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేటి బీజేపీ ప్రభుత్వంపై ఆ బాధ్యత ఉంది. దానికోసం ఎంతవరకైనా పోరాడేది మా ప్రభుత్వమే. దానికి ఈ కేసు కూడా ఒక వేదికగా, అవకాశంగా ఉపయోగపడితే అన్యాయం జరిగిందని ఎత్తిచూపుతాం. జరిగిన అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే ప్రయత్నం చేస్తాం. లేదంటే అన్యాయాన్ని సరిదిద్దాలనైనా గట్టిగా పట్టుబడతాం. దాంట్లో దాపరికాలు, మొహమాటాలు లేవు. ముందు నుంచీ మేం ఓపెన్‌గా ఉన్నాం. అలా ఉండటం వల్లే నాడు తెలంగాణాలోనూ నష్టపోయాం. ఉమ్మడి రాష్ట్రం ఉంటే అక్కడ కూడా అధికారంలోకి వచ్చేవాళ్లం. కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేము అనుకుంటే.. అక్కడ జరిగిన అన్యాయానికి అయినా న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తాం.

*ఉండవల్లి అలా ఎందుకు మాట్లాడారో..?:
ఉండవల్లి ఎంపీగా చేశారు…అందరికి ఆయన పట్ల గౌరవం ఉంది. సగటు రాజకీయ నాయకుడిగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఉన్న అవకాశాలన్నిటినీ వినియోగించుకుంటున్నాం అన్నది గమనిస్తే ఆయనకే తెలుస్తుంది. కానీ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు డీల్‌ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది ఉద్యమం కాదు కాబట్టి అలా చేయలేం. మరి ఉండవల్లి ఎనిమిదేళ్లుగా కోర్టులో వేసిన కేసు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చెన్నై కావాలి అన్నట్లు… చేయడానికి వెనక్కి పోలేము. ఈ విషయం ఉండవల్లికి కచ్చితంగా తెలుసు.. తెలిసినా ఇలా మాట్లాడితే మేం కూడా ఇలా రెస్పాండ్‌ కావాల్సిన పరిస్థితి వస్తుంది.