Chief Justice Of India: Justice D Y Chandrachud To Take Oath As 50th  Chief Justice Of India Today

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును జస్టిస్ యుయు లలిత్ సిఫారసు చేశారు.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యశ్వంత్ చంద్రచూడ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

చంద్రచుడ్ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు 44 సంవత్సరాల క్రితం చంద్ర చూడ్ తండ్రి యశ్వంత్ విష్ణుచూడ్ సుదీర్ఘ కాలం పాటు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. చూడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి తో పాటు మంత్రులు ప్రతిపక్ష పార్టీల నాయకులు తో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పతి భవన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

 జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులపాటే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటుండగా, జస్టిస్ చంద్రచూడ్ మాత్రం సుదీర్ఘకాలం అంటే రెండేళ్ల వరకు సీజేఐగా వ్యవహరించనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు