రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు .కుటుంబ పాలనతో ప్రజలు విసిగిత్తిపోయారని ఆరోపించారు. బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగోష- బిజెపి భరోసా అనే కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ లో ప్రారంభమై అన్ని గ్రామాలలో మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించారు. యాత్ర ఖానాపూర్ నుండి పాలెం వెంకటాపూర్ లింగసానిపల్లి గుడ్ల నర్వ మీదుగా సాగింది ఈ సందర్భంగా ఖానాపూర్ లో ఎమ్మెల్యే రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని తప్పుడు హామీలతో మోసం చేసిందని విమర్శించారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దందాలు చేసుకునే నాయకుడు కాబట్టి నాగర్ కర్నూల్ లో కూడా భూమి అమ్మితే ఎంత,ఇసుక,మట్టి అమ్మితే ఎంత అనే ధోరణిలోనే వ్యవహరిస్తుంటారని ఆరోపించారు.ఎలక్షన్ టైంలో చెప్పినటు వంటి నిరుద్యోగ భృతి, ఇంటికి ఒక ఉద్యోగం, మూడెకరాల భూమి ఇలాంటి హామీలు చెప్పి తెలంగాణ ప్రజలని మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మోసబోయిన ప్రజల కోసమే ప్రజాగోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన 119 స్థానాల్లో సొంతంగా నిలబడి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసంతో ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.