*తెలంగాణ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సిద్దమైనారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం అర్ధ రాత్రి జనగాం జిల్లా పెంబర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చేక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు తీరును పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పోలీస్ కమిషనర్ చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ జనగాం రైల్వే స్టేషన్ లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను పర్యవేక్షంచ్చారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ పడగా విప్పింది. లంగర్ హౌస్ లో మంగళవారం సాయంత్రం ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని సమీపం లోని రాజేంద్ర నగర్ లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్లి బట్టలు విప్పదీసి విపరీతంగా కొట్టినట్లు ఇర్ఫాన్ తెలిపాడు .తమ మాట వినక పోయిన,ఎదురుతిరిగిన ఇదేవిదంగా శిక్షిస్తామని గ్యాంగ్ వార్ హెచ్చరించినట్లు అతను తెలిపాడు. తాను వారి నుండి తప్పించుకొని రావడం వల్ల బ్రతికిపోయానని లేకపోతే చనిపోయేవాడినని ఇర్ఫాన్ వాపోయాడు .ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు

 

హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు.ఆ సమయంలో విద్యార్థిని తృటిలో   తప్పించుకుంది.

ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌పై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశాక మరిన్ని సెక్షన్లు నమోదు చేయనున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.వర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు భగ్గుమన్నారు

. దుశ్చర్యకు పాల్పడిన ప్రొఫెసర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ గేటు ఎదుట ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు

. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆచార్యులే దారుణాలకు పాల్పడితే ఇంకెవరికి చెప్పాలంటూ పలువురు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ యాజమాన్యం స్పందించి ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకునేంత వరకు అందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.

वाईएसआर तेलंगाना पार्टी की अध्यक्ष शर्मिला का तेलंगाना में कड़वा अनुभव रहा। वह अपने द्वारा स्थापित पार्टी को मजबूत करने के लिए पूरे तेलंगाना में पाद यात्रा कर रही हैं। पादयात्रा को लोगों का रिस्पांस नहीं मिल रहा है.शर्मिला ने अपनी राजनीतिक रणनीति में बदलाव करते हुए अधिकार तेलंगाना राष्ट्र समिति पर टारगेट किया है।. मुख्यमंत्री केसीआर अपने बेटे आईटी और नगर पालिका शाखा मंत्री केटीआर पर आरोप कर रहे हैं। इसके अलावा मंत्रियों और स्थानीय नेताओं पर भ्रष्टाचार के कई आरोप कर रहे हैं. पिछले कुछ समय से खामोश रही है. वारंगल जिले में पदयात्रा के लिए आई शर्मिला पर टीआरएस कार्यकर्ताओं ने हमला किया। आंदोलनकारियों ने शर्मिला के वाहन को आग लगा दिया. । उनकी कार तोड़फोड़ की गई। इलाके में तनावपूर्ण स्थिति को देखते हुए पुलिस शर्मिला को गिरफ्तार कर हैदराबाद ले गई

 

मंगलवार दोपहर में मुख्यमंत्री कार्यालय, प्रगति भवन का घेराव करने के लिए निकले थे, । मामले की जानकारी होने पर पुलिस अलर्ट हो गई।,.पुलिस ने पंजागुट्टा में उस कार को रोक लिया, जिसमें वह सवार थी। … शर्मिला ने मानने से इनकार कर दिया, फिर भी पुलिस ने उसे कार से बाहर निकलने के लिए कोशिस की.। स्कूलों और कॉलेजों से निकलने का समय होने के कारण सड़कों पर बड़े पैमाने पर जाम हुवा। पुलिस ने क्रेन की मदद से कार को एसआर नगर थाने में पहुंचाया।

जब शर्मिला ने वहां भी कार से उतरने से इनकार कि. . पुलिस ने कार का दरवाजा तोड़कर उसे बाहर निकाले. और हिरासत में ले लिया। पुलिस ने शर्मिला के खिलाफ यातायात नियमों के उल्लंघन के साथ न्यू सेंस करने के आरोप में विभिन्न सेक्शनओं दर्ज किया है

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ప్రజల నుండి నిరసన సెగ తగిలింది .  గబ్బిలాల పేటలో కమిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాలనీవాసులు టిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు