తెలంగాణలో  మొదలైన ఐటీ దాడులు

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులే టార్గెట్

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో పాటు పలువురు ఇళ్ల పై  కార్యాలలపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను శాఖ

తెలంగాణలో  రాజకీయ నాయకుల వ్యాపార సంస్థలు పై  ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్  దాడులు  మళ్ళీ మొదలయ్యాయి.కొన్ని రోజుల క్రితం సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్  వ్యాపార సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ ,  ఇన్కమ్   డిపార్ట్మెంట్  లు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. తాజాగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ గా చేస్తూ దాడులు కొనసాగుతున్నాయి .తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ,ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆరోపిస్తున్నట్లుగానే దాడులు కొనసాగుతున్నాయి మంత్రులు, నాయకులకు వారి సంబంధించిన బంధువుల వాణిజ సంస్థలకు సంబంధించిన లావాదేవీలపై  ఐ.టి. నిఘా పెంచింది

 


మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు  బృందాలుగా విడిపోయి విస్తృతమైన సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాదులో మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన కళాశాలలు ,వ్యాపార సంస్థలు ,విల్లాల ఏక కాలం లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు.ఆయన అల్లుడు ఇంటి పై కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఈ సోదాల్లో దాదాపు 50 బృందాలు పైగా పాల్గొన్నట్లు తెలిసింది మల్లారెడ్డి ఇంటిపై ఐట శాఖ దాడులు కొనసాగుతున్నట్టు తెలిసి టిఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది.