డాక్టర్ చెరుకు సుధాకర్. ను చంపేస్తానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని పలువురు బీసీ నేతలు డిమాండ్ చేశారు

డాక్టర్ చెరుకు సుధాకర్ చంపేస్తానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం  ఉదయం హైదరాబాద్  ఎల్బినగర్ లోని మహాత్మా పూలే విగ్రహం వద్ద పలువురు బీసీ నేతలు   నల్ల బ్యాడ్జి  లు ధరించి.ప్లకార్డు ల తో
నిరసన  ప్రదర్శన నిర్వహించారు..
ఈ సందర్భంగా  బలహీన వర్గాలకు చెందిన నేతలు మాట్లాడుతూ  నల్గొండ జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలకు రక్షణ లేకుండా పోయిందని తక్షణమే డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ కు జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు .

కోమటి రెడ్డి వెంకటరెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు .
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.దాదాపు 50 మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నరు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బీసీ ఉద్యమకారుడు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు. శ్రీధర్ గౌడ్ .కే. వి. గౌడ్ జనగాం వెంకటేష్ గౌడ్ ,ఘోర శ్యాంసుందర్..బొంగువెంకటేష్ గౌడ్ .కొండల్ గౌడ్ నకిరేకంటే శ్రీనివాస్ గౌడ్ దుర్గయ్య గౌడ్రామ్ కోటి ముదిరాజ్ .బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు