NEW GOVT  MEDICAL COLLEGES IN TELANGANA ..

పేద విద్యార్థులకు‌ వైద్య విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినక  మెడికల్ కాలేజీలో మంగళవారం నుండి తరగతులుప్రారంభమయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలకు ఈ ఏడాదిలో కొత్తగా వైద్య కళాశాలలు మంజూరయ్యాయి.రెండు కళాశాలలకు మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ లో 150 సీట్లు చొప్పున మంజూరయ్యాయి. మంగళవారం వర్చువల్ పద్దతి ద్వారా సి.ఎం. కేసీఆర్ ప్రారంభించారు.నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ లోని నూతన వైద్య కళాశాల భవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ఉదయ్కుమార్ఆధికారులు.విద్యార్థులు,అధ్యాపకులుపాల్గోన్నారు.కొత్తగా చేరిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందలు తెలిపారు.ఈ శుభ సందర్భంగా ఒకరికోకరు మిఠాయిలు తినుపించుకున్నారు.ప్రస్తుతం 150సీట్లకు గాను 93 సీట్లు మొదటి విడతలో భర్తీ అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు.

పేదలకు వైద్య సేవలందించేందుకు మెడిసిన్ లో చేరామని పలువురు విద్యార్థులు తెలిపారు.