మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి

‌- అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం

‌- అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రేరణ

‌- అన్నపూర్ణగా మారిన తెలంగాణ తల్లి… దాని వెనుక కేసీఆర్ తీవ్ర శ్రమ

‌- అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి

‌- శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించపోయినా … ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న తెలంగాణలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నా .. పట్టుదలతో రాష్ట్రాన్ని పురోగతి బాటలో మహోన్నత నాయకుడు కేసీఆర్ నడిపిస్తున్నారని చెప్పారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ఆమె మాట్లాడారు.

దేశంలో మన రాష్ట్రం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి తన ప్రసంగంలో కూలంకుశంగా చాలా అద్భుతంగా చెప్పారని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే మానవతా దృక్పథం, దార్శనికత, రాజనీతజ్ఞత, కార్యదీక్ష కలిగిన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. అంటువంటి నాయకుడు సీఎం కేసీఆర్ కు ఎన్ని ఎదురుగాలులు వీచినా… కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా… రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అడుగడుగున అడ్డుపడినా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం ప్రజలందరికీ గర్వకారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ కార్యక్రమం, పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని, ఉత్తేజాన్నిస్తున్న విధంగా ఉన్నాయని, దాదాపు 17-18 రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి అనేక కార్యక్రమాలను అధ్యయనం చేశాయని గుర్తు చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ సభకు హాజరైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్ మన దగ్గర అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంతో స్పూర్తి పొంది వెంటనే వారి రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించడం మన రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధించిందని తెలియాలంటే ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత పెరిగిందన్నది కొలమానం ఉంటుందని, 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 124104 ఉండేదని, 2022 నాటికి అది రూ. 317118కు పెరిగిందని వివరించారు. పెద్ద ఎత్తున జీవన విధానం, జీవన శైలిలో మార్పులు వచ్చాయో అర్థమవుతోందని తెలిపారు. దానికి కేసీఆర్ పాలన ఎంతగానో తోడ్పడిందని స్పష్టమవుతోందని అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెన్షన్లు, పెట్టుబడులు పరిశ్రమల వంటి రంగాలతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అడవుల పెంపకం, ఆలయాల అభివృద్ధి దళిత వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి, అగ్రవర్ణాల పేదల సంక్షేమం… ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా మన ప్రభుత్వం ఏ ఒక్కరినీ విస్మరించలేదని, ప్రతీ ఒక్కరి సమస్యను తన సమస్యలుగా భావించి ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందువల్లనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని తేల్చిచెప్పారు.

దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే గర్భిణీ స్త్రీలు, మహిళా సంక్షేమం కోసం అనేక మాటలు చెప్పే ప్రభుత్వాల మాటలు వింటాం కానీ నిధులు ఖర్చు చేసి తోడ్పాటునివ్వడాన్న తక్కువగా చూస్తామని చెప్పారు. లక్ష ప్రసవాలకు 92 మంది మరణించేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అవి 43కు తగ్గాయని పేర్కొన్నారు. శిశువుల మరణాలు కూడా తగ్గాయని అన్నారు. పోషకాహారాన్ని అందించే అంగన్ వాడీ, ఆశా వర్కర్ల వ్యవస్థను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 35700 గన్ వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే వర్కర్ల వేతనం చాలా తక్కువగా ఉండేదని, దాన్ని సీఎం కేసీఆర్ రూ. 13650కు పెంచారని తెలిపారు. అందులో కేంద్రం వాటా కేవలం రూ. 2700 మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 10950 ఉందని వెల్లడించారు. ఆశా వర్కర్ల వేతనం రూ. 2 వేలుగా ఉండేదని, దాన్ని రూ. 9750 పెంచామని గర్తు చేశారు. ఇందులోనూ కేంద్రం వాటా కేవలం రూ. 1200 మాత్రమేనని ఎండగట్టారు. కేవలం మనస్సు ఉంటే సరిపోదదని, ఆ మనస్సుకు, ఆలోచనలకు తగ్గట్టుగా అవసరమైన చోట ప్రజలు డబ్బు ఇస్తుండాలని, అలా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది గర్భణీలకు లబ్దీ జరిగిందని చెప్పారు. పిల్లల విద్య కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసిందని, మన ఊరు మన బడి కింద రూ. 7 వేల కోట్లతోపాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని, మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాన్ని రూ. 3 వేలకు ప్రభుత్వం పెంచిందని, అందులో కేవలం రూ. 600 మాత్రమే కేంద్రం వాటా అని వివరించారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇదంతా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు.

ప్రైవేటు పెట్టబడులను ఆకర్శించి రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకుపైగా ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలను ఇచ్చామని గుర్తు చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి వేతనాలు పెంచామని, ఆర్టీసీ, సింగరేణి, జన్కో, టాన్స్ కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తమ గ్రామాలను కూడా తెలంగాణలో విలీనం చేయాలంటూ పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి సర్పంచ్ లు డిమాండ్ చేస్తుండడం తెలంగాణకు గర్వకారణమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మారిందని, దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ తీవ్రంగా ఉందని తెలిపారు.

“నాకు దేశం ఏం ఇచ్చిందన్న నిర్లప్తత గతంలో కొంత మందిలో ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి వచ్చాక నాకు దేశం ఏం ఇచ్చిందన్నది కాకుండా దేశానికి నేనేం ఇస్తున్న అనే పంథాతో ఆలోచిస్తు రాష్ట్రంలో సంపద ను పెంచి దాన్ని దేశమంతటా పంచుకున్న సందర్భం ఇది. ” అని వ్యాఖ్యానించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిల్ లోనూ ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ కు కవిత విజ్ఞప్తి చేశారు. దానికి తక్షణమే స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకు అంగీకరించారు. ఇప్పటికే ఈ విషయమైన సంబంధిత అధికారులకు దేశాలు జారీ చేశామని తెలియజేశారు.

బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని… తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు. బండి సంజయ్ బతుకమ్మను కూడా అవమానించారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని… తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీకి దైవశక్తి అవసరమని, అందుకే యాగాలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తానని… పోటీ చేయకపోతే, అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలను తాము ఎప్పుడూ తిట్టలేదని, ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని అన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

ఢిల్లీ ఉప మఖ్యమంత్రి సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది.

దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను   అందించాలని కల్వకుంట్ల కవిత  కోరారు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు.

दिल्ली शराब घोटाले में टीआरएस एमएलसी कविता का नाम एक बार फिर सामने आया है। ईडी के अधिकारियों ने इस मामले में आरोपी अमित अरोड़ा की रिमांड रिपोर्ट में कविता के नाम का जिक्र किया है।

32 पेज की रिमांड रिपोर्ट में तीन बार कविता का नाम आया है। रिमांड रिपोर्ट के अनुसार रु. 100 करोड़ रुपए साउथ ग्रुप ने चुकाए। इस दक्षिण समूह को कविता, YCP राज्यसभा सदस्य विजयसाई रेड्डी के बहनोई सरथ रेड्डी और YCP सांसद मगुन्टा द्वारा नियंत्रित किया गया था। साउथ ग्रुप द्वारा रु. विजय नायर को 100 करोड़ रुपये मिले। ट्रायल के दौरान अमित अरोड़ा ने अपनी गवाही में इसकी पुष्टि की।

रिमांड रिपोर्ट के मुताबिक, कविता द्वारा इस मामले में गतिविधियों के लिए इस्तेमाल किए गए 10 सेल फोन नष्ट कर दिए गए थे। ईडी ने कहा कि सबूत नष्ट किए गए पाए गए हैं। इस मामले में 36 लोगों ने रु. इसमें कहा गया है कि 1.38 करोड़ के 170 मोबाइल फोन नष्ट कर दिए गए। बताया जाता है कि कविता ने दो नंबर वाले 10 फोन इस्तेमाल किए

భారతీయ జనతా పార్టీ కి తెలంగాణ లో క్యాడర్ ,లీడర్లు లేరని తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శించింది. ఆ పార్టీకి నిర్మాణాత్మకమైన సిద్ధాంతం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ..రామ్ నామ్ జపం చేసుకుంటూ పరాయి పార్టీలకు చెందిన నాయకులను ప్రలోభ పెట్టడం లేక సిబిఐ ఈడి ఐటి వంటి సంస్థల ఉపయోగించి భయపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆమె విమర్శించారు.

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉండే భారతీయ జనతా పార్టీ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారని కానీ వారి ప్రయత్నాలు సాగబోవని ఆమె అన్నారు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటికి రావడంతో బిజెపి అసలు స్వరూపం బయటపడిందని ఆమె అన్నారు

. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో కవిత మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ నాయకుడు సంతోష్ జికి పోలీసులు నోటీస్ ఇస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదని కవిత అన్నారు. నేరంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని దానికి బండి సంజయ్ షేక్ అవుతున్నాడు అంటే ఈ కేసులో ఉన్న తీవ్రతను అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు

. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్రంలో మంత్రులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని కవిత ధ్వజం ఎత్తారు. ఇలాంటి దాడులకు తాము భయపడబోమని మరింత రాటు తేలి పార్టీని బలోపేతం చేస్తామని కవిత బిజెపి నాయకులను హెచ్చరించారు.

 

2023 నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ ‌ – ఇండియా టుడే సాహిత్య పురస్కారం*

*ఆజ్ తక్ సాహిత్య సమ్మేళనంలో ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత*

: సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశంలో సహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్య కారులు కృషి చేయాలని కోరారు.

ఆదివారం  న్యూఢిల్లీలో జరిగిన ఆజ్ తక్ (ఇండియా టుడే) సంస్థ వారి సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ ‌ – ఇండియూ టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “సాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా సాహిత్యం ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాము” అని వ్యాఖ్యానించారు. ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతలో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనస్సులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి నెలకొందని, కాబట్టి కలానికి పదును పెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే కవులు సమాజాన్ని కలిపేందుకు కృషి చేయాలని అన్నారు. ఆ కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియా టుడేతో పాటు తామంతా అండగా నిలబడుతామని, కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని చెప్పారు.

యువతకు సాహిత్యం అర్థంకాదని… భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటారని, కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని స్పష్టం చేశారు. దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని కవిత తెలియజేశారు. సాహిత్య ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు.