రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. నియోజకవర్గ ఇన్ చార్జి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో రాజీ లేకుండా పోరాటం చేస్తుందన్నారు..నియోజకవర్గంలోని ఉమ్మెంట్యాల, లాలాపేట్, కొందురుగు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిర్మాణ స్థలంలో మోకాళ్ల లోతు నీటిలో నిలబడి నిరసన తెలిపారు

  డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పింఛన్‌, రేషన్‌కార్డు, లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణం, ఉద్యోగం తదితర హామీలను ఎమ్మెల్యే అంజయ్య  ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నియోజకవర్గంలో పోరాడతానని వీర్నపల్లి శంకర్ హెచ్చరించారు.