*పివి రమేష్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌..*
*చంద్రబాబును ఏ-1గా మార్చిన సీఐడీ..*

పీవీ రమేష్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్‌ స్కామ్‌ డొంక మొత్తం కదిలింది. అవును, టోటల్‌ స్కిల్‌ స్కామ్‌ ఎపిసోడ్‌లో అత్యంత కీలకంగా మారారు రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీ రమేష్‌. ఆనాడు ఏపీ ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్‌..

పీవీ రమేష్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్‌ స్కామ్‌ డొంక మొత్తం కదిలింది. అవును, టోటల్‌ స్కిల్‌ స్కామ్‌ ఎపిసోడ్‌లో అత్యంత కీలకంగా మారారు రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీ రమేష్‌. ఆనాడు ఏపీ ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్‌.. సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని వారించారు. ఆ మేరకు సీఎస్‌కు లేఖ కూడా రాశారు. సీమెన్స్‌కి నిధులు రిలీజ్‌ చేయొద్దని సూచించారు. ఇదే విషయాన్ని సీఐడీ విచారణలో స్టేట్‌మెంట్‌గా ఇచ్చారు పీవీ రమేష్‌.పీవీ రమేష్ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే చంద్రబాబుపై అభియోగాలు నమోదుచేసింది సీఐడీ. బాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్టు సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారుపీవీరమేష్‌. అందుకే, ఈ స్కామ్‌లో ప్రధాన లబ్దిదారు చంద్రబాబే అంటోంది సీఐడీ. అంతేకాదు, ఈ కేసులో చంద్రబాబును A37నుంచి A1గా మార్పులుచేసింది.

పీవీ రమేష్ వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. పుణెలో స్కామ్‌ లింకులు బయటపడ్డాక రమేష్‌‌ను విచారించింది సీఐడీ. సీమెన్స్‌ ప్రతినిధులను కూడా విచారించింది సీఐడీ. పీవీ రమేష్‌ అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డొల్ల కంపెనీల లింక్‌లు, ఆధారాలు సేకరించింది సీఐడీ. ఈ ఆధారాలను బేస్ చేసుకునే చంద్రబాబు విషయంలో సీఐడీ దూకుడు పెంచింది.

आंध्र प्रदेश के मुख्यमंत्री जगनमोहन रेड्डी के चाचा और पूर्व सांसद वाईएस विवेकानंद रेड्डी की हत्या का मामला दिन-ब-दिन नए मोड़ लेता जा रहा है। जगनमोहन रेड्डी के करीबियों के इर्द-गिर्द घूम रहा यह मर्डर केस… मामले की जांच कर रही सीबीआई पहले ही कुछ लोगों को गिरफ्तार कर चुकी है और हाल ही में कडप्पा के सांसद वाईएस अविनाश रेड्डी को नोटिस भी जारी कर चुकी है। उन्हें मंगलवार को हैदराबाद स्थित अपने कार्यालय में पेश होने का निर्देश दिया गया है।

उसका हत्या से कोई लेना-देना नहीं था
अविनाश रेड्डी ने कहा कि मीडिया का एक वर्ग पिछले ढाई साल से मुझ पर और मेरे परिवार पर झूठे आरोप लगा रहा है.

उन्होंने कहा कि उन्हें अपने ऊपर लगे आरोप हजम नहीं हो रहे हैं। उन्होंने कहा कि मैं कौन हूं और मेरे तरीके क्या हैं, यह सभी जानते हैं, लेकिन इस आरोप से वह मानसिक रूप से उदास हैं.

A.P.Congress News..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరాశపరించందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ప్రధానమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా ఎన్నో హామీలు తమకు లభిస్తాయని ప్రజలు భావించారని కానీ అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టి వెళ్లిపోయాడని ఏపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి అన్నారు

Tulasi Reddy , Congress Leader

.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులపై మాట్లాడుతాడు అని అనుకున్నామని కానీ అవి ఏమీ లేకుండా నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరూ మోడీ భజన తో కాలం గడుపుతున్నారని  తులసి రెడ్డి  ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తేనే అన్ని విషయాల్లో అభివృద్ధి సాధిస్తుందని తులసి రెడ్డి చెప్పారు

ఏపీ కి కొత్త సీఎస్‌ జవహర్‌ రెడ్డి..?

సమీకరణాలన్నీ జవహర్‌ రెడ్డికే అనుకూలిస్తున్నాయి..

నెలాఖరుతో ముగియనున్న సమీర్‌ శర్మ గడువు..

రేసులో శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి.. జవహర్‌కే దక్కనున్న చాన్స్‌..

*కాబోయే చీఫ్‌ సెక్రటరీ ఎవరు? ఆ పదవి దక్కేది ఎవరికి? శ్రీలక్ష్మికా? జవహర్‌ రెడ్డికా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… సమీకరణాలన్నీ జవహర్‌ రెడ్డికే అనుకూలిస్తున్నాయి..*

కాబోయే సీఎస్‌ ఆయనే అని అధికారవర్గాలు చెబుతున్నాయి. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది.

ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ కావాల్సింది. అయితే… రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది.

ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది.

అంటే… ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో… మరో కారణంవల్లో 2023 నవంబరువరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు.

కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.

శ్రీలక్ష్మికి అవకాశం లేనట్లే..

సమీర్‌ శర్మ తర్వాత ఏపీ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలున్నారు. వీరందరిలో… పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి పేర్లు మాత్రమే తదుపరి సీఎస్‌ పదవికి వినిపిస్తున్నాయి.

సమీర్‌ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్‌ తానే అని పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్‌) గట్టిగా భావించారు. ఇప్పుడు ఎందుకోగానీ ఆమె నిశ్శబ్దం వహించారు. ఆమె సీఎస్‌ ఆయ్యే చాన్స్‌ లేదని ఐఏఎస్‌ వర్గాలే చెబుతున్నాయి.

ఇప్పుడు శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఓబుళాపురం గనుల కేసులో ఆమెపై అభియోగాలను తెలంగాణ హైకోర్టు రెండు రోజుల కిందటే కొట్టివేసింది. దీంతో… సీఎస్‌ పోస్టు దక్కించుకునేందుకు ఆమెకు లైన్‌ క్లియర్‌ అయింది.

అయితే… ఆమెకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉంది. 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోతే… తదుపరి సర్కారు ఆమెను పక్కకు తప్పించి, అప్రాధ్యాన్య పోస్టులో నియమించవచ్చు. ఇది ఆమెకు ఇబ్బందికర పరిణామమే అవుతుంది.

ఎలాగూ నాలుగేళ్ల సర్వీసు ఉన్నందున ఎన్నికల తర్వాతే ఈ పదవి గురించి ఆలోచించవచ్చునని శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు… శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి అప్పగించడంపై జగన్‌ కోటరీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గం, విధేయత, ఇలా ఏ కోణంలో చూసినా జవహర్‌ రెడ్డికే సీఎస్‌ పోస్టు కట్టబెట్టాలని భావిస్తున్నారు.

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదనే అంచనాకు వచ్చారని… జవహర్‌ రెడ్డినే సిఎస్ గా ఎంపిక చేయడం ఖాయమని చెబుతున్నారు….