ప్రజలకు  మెరుగైన  వైద్యం  అందించేందుకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఏ. పి  లో  పేద ప్రజలకు వైద్యం అందించేందుకు చాలా చోట్ల ప్రభత్వ వైద్య శాలలు అందుబాటులో ఉన్నప్పటికీ  సరపడ వైద్యులు,వైద్య సిబ్బంది లేక పోవడం వల్ల సకాలం లో వైద్యం అంతగా  అందడం  లేదనే విమర్శలు తరచుగా వినిపిస్తోన్నాయి. వైద్య సౌకర్యాల పై పలు సందర్భాల్లో   రొగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను గమనించిన ఆ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ కీలక నిర్ణయం తీసుకున్నారు . అవసరమైతే గంటల లెక్కన (అవర్లి బేసిస్ )పారితోషికం విధానం  లో రిక్యూట్ చేసుకోవాలని  ,అందుకు అవసరమయ్యే మార్గ దర్శకాలను జిల్లా కలెక్టర్లకు పంపాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదికారులను మంత్రి  రజనీ ఆదేశించారు

. అవసరమైన చోట్ల నర్సులను కూడా వెంటనే   భర్తీ  చేయాలని ఆమె ఆదేశించారు. ఆదేవిదంగా  అనస్తీసియా  డాక్టరులను కూడా తీసుకోవాలని ఆదేశించారు. బుడవారం మంగళగిరి లో ని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో  FAMLY PHYSICIAN  విదానం పురోగతిని సమీక్షించారు . ఈ పధకం ప్రారంబించే నాటికి ప్రభత్వ హాస్పిటల్ లో వైద్య సిబ్బంది 86 శాతం ఉండేదని  ఇప్పుడు ఆ సంఖ్య 96 శాతం  దాటిందని మంత్రి విడుదల రజనీ చెప్పారు . హెల్త్ క్లినిక్ లకు ప్రజల నుండి మంచి ఆధరణ  లభిస్తోందని ఆమె చెప్పారు

. ఈ పధకం అమలులో  ప్రజలకు ఉత్తమ సేవలు అందించే డాక్టర్లకు ,వైద్య సిబ్బందికి   ప్రోత్సాహకాలు అండ చేస్తామని మంత్రి విడుదల రజనీ అంటున్నారు . అవర్లి బేసిస్ లో  డాక్టర్లను తీసుకోవడం వల్ల ప్రజలకు మరింత సేవలు అందించే  అవకాశం ఉంటుందని  భావిస్తున్నారు