మేడ్చల్ బరిలో ఈటెల

-–-హుజరాబాద్ లో జమున రెడ్డి

–గెలుపు లక్ష్యంగా బిజెపి పావులు

(ఏ ఆర్ మీడియా) హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీనియర్ నేతలు అంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల సతీమణి జమునా రెడ్డి పోటీ చేసేందుకు కుటుంబ పరంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా ,పార్టీ అధిష్టాన వర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. అయితే ,రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

మేడ్చల్ లో రసవత్తర పోటీ:

మేడ్చల్ నియోజకవర్గం లో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది .. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే, సిహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు ..   తాజాగా ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గంలో పోటీ  చేయాలని నిర్ణయ తీసుకున్నారు. .    మంత్రి మల్లా రెడ్డి, ఈటెల ఇద్దరు ఆర్ఫికంగా  బలమైన వారు కావడం వల్ల పెద్ద ఎత్తున “నువ్వా , నేనా” అన్నట్లుగా పోటీ నెలకొనే అవకాశం ఉంది.  మేడ్చల్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ తన సొంత క్యాడర్ తోఎన్నికలను ఎదుర్కోవడానికిసిద్ధమవుతున్నారు. పైగా, ఇదే నియోజకవర్గంలో తన నివాసం కూడా ఉండటం వల్ల ఈటెల రాజేందర్ స్థానికుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ,రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. ఎలాగైనా మేడ్చల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రంగం సిద్ధమైంది

హుజురాబాద్ లో ఈటల జమునా రెడ్డి..

హుజురాబాద్ లో కూడా గెలుపే లక్ష్యం:
హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ సతీమణి జమునా రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .. అయితే, హుజరాబాద్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న రాజేందర్ కు అక్కడ గెలవడం సునయాసమే… అందుకోసమే అక్కడి నుంచి ఆయన సతీమణి జమునా రెడ్డిని రంగంలోకి దింపి గెలిపించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది … ఇప్పటివరకు ఈటెల రాజేందర్ తన రాజకీయ జీవితంలో హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో ఓటమి ఎరగని నాయకుడిగా రాష్ట్రస్థాయి నాయకుడుగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఆయన కుటుంబానికి తిరుగులేని ప్రజాభిమానం సొంతమైంది.. ఒకే కుటుంబంలో ని భార్య భర్తలు వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..