
భారత్ జోడో యాత్ర లో విషాదం నెలకొ ంది మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ ప్రసాద్ పాండే భారత్ జోడోయాత్రలో కవాత్ చేస్తూ మరణించారు.75 ఏళ్ల పాండే, కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తున్నారు.
కృష్ణ ప్రసాద్ మరణించిన విషయాన్ని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ధృవీకరించారు. , “భారత్ జోడో యాత్రలో మంగళవారం ఉదయం, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే జాతీయ జెండాను పట్టుకుని దిగ్విజయ్ సింగ్ & నాతో కలిసి నడుస్తున్నారు” అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు
“ కానీ కొన్ని నిమిషాల్లోనే అతన్ని మృత్యువు కబళించింది , మార్చ్ లో భాగంగా కృష్ణ ప్రసాద్ పాండే జాతీయ జెండాను మరో సేవాదళ్ వాలంటరీ ఇచ్చి వెనక్కి వెళ్ళాడు. ఆ తర్వాత అతను కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయాడు హుటాహుటిన కృష్ణ ప్రసాద్ పాండే ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆస్పత్రిలో చేర్చడానికి ముందే చనిపోయినట్లు వైద్యులు ద్రవికరించారు, ” అని జై రామ్ రమేష్ చెప్పారు. సీనియర్ నాయకుడు కృష్ణ ప్రసాద్ పాండే మరణం పట్ల కాంగ్రెస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి ని ప్రకటించాయి
Recent Comments