ప్రధాన మంత్రి తెలంగాణ పర్యటనను తెలంగాణ సర్కార్ రాజకీయం చేస్తోందని భారతీయ జనతా పార్టీ మండి పడింది . ప్రధాని మోడీ రాష్టం లో అధికారికంగా పర్యటిస్తున్నారని దీనికి సంబందించిన ప్రోటోకాల్ మొత్తం అధికారులే చూసుకుంటారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారుఅన్న దాతలకు అవసరమైన ఎరువుల ఉత్పత్తుల కోసమే రామగుండము ఎరువుల కర్మాగారాన్ని పునః ప్రారంభిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న చొరవ వల్లనే ఇది సాధ్యమైందని అరుణ అన్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావ్ ను ప్రధాన మంత్రి కార్యాలయం ఆహ్వానించలేదని టి.ఆర్ ఎస్ నాయకులు సిగ్గు చేటని ఆమె అన్నారు.ప్రొటో కాల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదశికి అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయం అందచేసిందని డి కె అరుణ చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలని ఆమె హితవు చెప్పారు. సంకుచిత భావాలు ప్రదర్శిస్తే ప్రజలే తగు గుణ పాఠం చెపుతారని డి కె అరుణ హెచ్చరించారు