దేశం లో  గవర్నర్ వ్యవస్థ వివాదం మరింత ముదురుతోంది, తాజాగా కేరళ సర్కార్ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పించింది.దేశం లో గవర్నర్ వ్యవస్థపై 1985లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీర్రంగా వ్యతిరేకించారు

.

అప్పట్లో NTR ప్రభుత్వాన్ని గవర్నర్ గా ఉన్న రామ్ లాల్ బర్తరఫ్ చేశారు. అప్పటినుండి గవర్నర్ వ్యవస్థ పై వివాదం కొనసాగుతూనేఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట ఈ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను వాడుకొని కేంద్రం తమపై పెత్తనం చేస్తుందని,బ్రిటిష్ వ్యవస్థకు చెందిన ఈ రాచరిక వ్యవస్థను ఎత్తివేయాలని విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా ముఖ్యమంత్రికి గవర్నర్ వ్యవస్థకు మధ్య యుద్ధం నడుస్తుంది. తన ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసేందుకు గవర్నర్ తమిళసై ప్రయత్నిస్తోందని ముఖ్య మంత్రి ఆరోపిస్తున్నారు. కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాల ప్రకారం భారతీయ జనతా పార్టీ ఏజెంట్ లా గవర్నర్ వ్యవహిరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు పదేపదే ఆరోపిస్తున్నారు

. శాసనసభలో గవర్నర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ కానీ దానికి భిన్నంగా తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ ను గవర్నర్ కు బదులుగా ముఖ్యమంత్రి లేదా ఆయన సూచించిన వ్యక్తి  ప్రవేశ పెడుతున్నారు వారే బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు.   గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమలకు అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదు. రాష్ట్ర సర్కార్ కి గవర్నర్ వ్యవస్థకు మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయిలో ఉండడంతో అనేక బిల్లులు పెండింగ్లోనే ఉంటున్నాయి. ఇక తమిళనాడులో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంది ముఖ్యమంత్రి గా జయలలి ఉన్న కాలం లో చాలా సందర్భాల్లో గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకింది.

అదేసమయం లో అక్కడ గవర్నర్గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి గవర్నర్ కు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవడంతో ముఖ్యమంత్రి జయలలిత ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వామపక్షాల ప్రభుత్వం అధికారంలోఉన్న కేరళ లో గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ కు ముఖ్యమంత్రి విజయ్ కి అసలు గిట్టడం లేదు. దేశం లో విశ్వవిద్యాలయాలకు గవర్ణర్లే ఛాన్సలర్ లు గా వ్యవహరించడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ తాజాగా కేరళ ప్రభుత్వం ఆ విధానానికి తిలోదళాకాలు ఇచ్చింది. రెండు యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమల కోసం అవసరమైతే ప్రత్యేకంగా శాసనసభ సభ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేయాలని చూస్తోంది కేరళ సర్కార్. దీంతో ప్రభుత్వానికి గవర్నర్కు వ్యవస్థకు మధ్య వివాదం మరింత ముదురుతోంది.కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్స్లర్ పదవి నుంచి గవర్నర్ను తొలగిస్తున్నట్లు Kerala Chief Minister Vijayam ప్రకటించారుఈ పదవిలో  గవర్నర్  కొనసాగాలని తాము భావించడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వివాదం తలెత్తడానికి కారణం ఇటీవలే. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయం తీసుకోవడమే…దాన్ని ప్రభుత్వం వామ పక్ష ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది

.గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీసీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు.దీంతో గవర్నర్, కు ముఖ్యమంత్రి మధ్య వివాదం మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏకంగా గవర్నర్ నే ఛాన్సలర్ పదవి నుండీ తొలగించాలని నిర్ణయంచింది.