కట్టలు వెదజల్లు– ఓట్లు రాబట్టు

మంత్రులు రూ. 200 కోట్లు

ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.100 కోట్లు పంచండి

మంత్రులు మేల్కోండి…!
ఓడిపోయారో గోవిందా .!!

సంచలనాలు క్రియేట్ చేయండి

డబ్బులు కాదు ముఖ్యం — గెలుపే లక్ష్యం

అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ లో పెట్టుకోండి

పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ చేయండి

అవసరమైతే రూ. 500 కోట్లయినా ఖర్చు పెట్టండి

సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులకు ఆదేశాలు

ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్

దిద్దుబాటు చర్యలు  షురూ

పీకే సర్వే తో కేసీఆర్ గుబులు

తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు

కొండం అశోక్ రెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్)

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా, హైదరాబాద్:

అసెంబ్లీ ఎన్నికలు తరుము కొస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గుబులు ప్రారంభమైంది. రాష్ట్రంలో వీస్తున్న కాంగ్రెస్ గాలికి తట్టుకోలేక అధికార పార్టీ కొట్టుకుపోతుంది… తాజాగా ప్రముఖ సిఫాలజిస్ట్, ఐ ప్యాక్ సర్వే సంస్థ అధినేత (పీకే ) ప్రశాంత్ కిషోర్ తాజాగా బి ఆర్ ఎస్ కి ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో పార్టీ ఆగాధంలో పడిపోతుందని చెప్పడంతో సీఎం కేసీఆర్ లో గుబులు ప్రారంభమైంది.. వెనువెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద అభ్యర్థులందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. “డబ్బులు వెదజళ్ళండి- ఓట్లు రాబట్టండి” అంటూ హుంకరించారు. ప్రధానంగా మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ లపై దృష్టి సారించి అధికారులను మచ్చిక చేసుకోవాలని ఆదేశించారు. మంత్రులు రూ. 200కోట్లు, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేసైనా ఓటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకుని , గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. డబ్బులతో పాటు స్థానికంగా ఏవైనా సంచలనాలు క్రియేట్ చేసి, ఓటర్ల సానుభూతిని పొందేందుకు పథకం ప్రకారం ముందుకు సాగాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.. ప్రధానంగా మంత్రులారా మేలుకోండి..! ఓడిపోయారో గోవిందా ..!! అంటూ సీఎం ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్6 రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , గంగుల కమలాకర్, మల్లారెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హవాకు తట్టుకోలేక పోతున్నారు.

ఓటమి అంచుల్లో మంత్రులు:

ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులంతా ఓటమి అంచుల్లో ఉన్నట్లు పీకే రిపోర్టుతో ఒక్కసారిగా పార్టీ అధినేత కేసిఆర్ షాక్ కు గురైనట్లు ప్రగతి భవన్ వర్గాల బోగట్టా.. అందరు మంత్రుల ఓటమి ఏమో కానీ, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఎదురీదుతున్నట్లు పీకే ఇచ్చిన రిపోర్టులో వెళ్లడైంది. దీనికి విరుగుడుగా, మంత్రి కేటీఆర్ స్థానిక సర్పంచులతోపాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ లతో ఫోన్ సంభాషణలు చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అర్థించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు.. గతంలో ఎన్నడూ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించారు.. ఇకనుంచి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారంలో రెండు రోజులు మీతో గడుపుతానని బతిమిలాడుకుంటున్నారు. పైగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారని, మన పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని, ఇది మంచిది కాదని మంత్రి కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఇలా మంత్రి కేటీఆర్ మేడపైనుంచి దిగి, నేల మీదికి వచ్చినట్లు కనబడుతోంది.

సిద్దిపేటలో సరైన లీడర్ లేకనే:

సిద్దిపేటలో కూడా తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది.. అయితే, అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన లీడర్ లేకపోవడం వల్ల సిద్దిపేటలో టిఆర్ఎస్ మెరుగైన ఫలితాన్ని సాధించనుంది. ఇక్కడ కూడా హరీష్ రావు కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. గతంలో లక్ష పైచిలుకు మెజార్టీ వస్తే , ఈసారి 20 నుంచి 30 వేలకు పడిపోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. ఇప్పటివరకు 16 మంది మంత్రుల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ , సిద్దిపేట నుంచి హరీష్ రావు మాత్రమే గెలుస్తారని ప్రచారంలో ఉండేది.. తాజాగా పీకే రిపోర్టులో ఈ రెండు నియోజకవర్గాల తాజా పరిస్థితిని తెలియజేయడం వల్ల కెసిఆర్ మరింత షాక్ కు గురైనట్లు తెలుస్తోంది..

కామారెడ్డిలో సీఎం ఎదురీత:

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా శృంగభంగం తప్పడం లేదు. ఈ రెండు స్థానాల్లో కూడా ఓటర్లు అంతగా పాజిటివ్ గా స్పందించడం లేదు.. గజ్వేల్లో ఓటర్లు సీఎం కేసీఆర్ పై కొంత గురుతర బాధ్యతతో ఓట్లు వేస్తామనుకుంటున్నా, కామారెడ్డి లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభావానికి ఎదురీత తప్పడం లేదు.. ఎందుకంటే కామారెడ్డి లో ఉన్న మైనార్టీ వర్గాలు, రైతులు, పెన్షన్ దారులు ,మహిళలు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారని రిపోర్టు పేర్కోవడం. అలాగే, స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడం వల్ల స్థానికంగా ప్రజలు తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంటే, నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రేవంత్ సీఎం అభ్యర్థిగా భావిస్తుండడం వల్ల అంతర్గతంగా ఓటర్లంతా ఆయననే గెలిపించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక గ్రౌండ్ రిపోర్ట్ ను బట్టి తెలుస్తోంది .. ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం వల్ల స్థానికంగా ఓడిస్తే, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ,కామారెడ్డి జిల్లా పరిస్థితి ఏంటి..? అనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమవుతుంది … ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కామారెడ్డి లో గెలిచేందుకు మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లపై ఆధారపడి ఉన్నారు. కానీ, ఈ నేతలు స్థానిక ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, తమకు, ఓటు చేయాలని చెప్పకపోవడం వల్ల కొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.. కేటీఆర్ రోడ్ షోలు మాత్రమే చేస్తూ, ప్రజలకు అభివాదం తెలిపే “హవ భావాలు” నచ్చడం లేదు.. గెలవక ముందే ఇలా ఉంటే , గెలిచిన తర్వాత ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ సభ కూడా స్థానిక ప్రజల మైండ్ సెట్ ను మార్చలేకపోయింది..

పోల్ మేనేజ్మెంట్ చేయండి :

తాజాగా పీకే ఇచ్చిన రిపోర్టులో బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో వెనుకబడిపోయిందని, ప్రస్తుతం, ఇక చేసేది ఏమీ లేదని చేతులెత్తేసినట్లు సమాచారం.. అయితే, పోలింగ్ కు తక్కువ సమయం ఉండటం వల్ల, పోల్ మేనేజ్మెంట్ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులు స్థానిక పోలీస్, ఎన్నికల అధికారులను మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్లడమే మిగిలిందని పేర్కొన్నట్లు సమాచారం.. ఇందులో భాగంగా మంత్రులు రూ.200 కోట్లు, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ. 100 కోట్లు ఖర్చు చేసైనా లక్ష్యం సాధించాలని అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అవసరమైతే పోటీలో ఉన్న మంత్రులు రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిందని వారికి గట్టిగా చెప్పినట్లు ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. అయినా కూడా ఇప్పటికిప్పుడు, ఓటర్లను బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలంటే, స్థానికంగా కొన్ని సంచలనాలు క్రియేట్ చేసి, ఓటర్ల సానుభూతిని పొందేందుకు ప్రయత్నించాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.. .ఈ రెండు అంశాలను పకడ్బందీగా నిర్వహించినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, పీకే , సీఎం కేసీఆర్ కు సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం .. ఏది ఏమైనప్పటికీ, బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిస్థాయిలో పాతాళానికి పడిపోయినట్లు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.. పీకే సూచనల మేరకు ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కనుంది. డబ్బుల సంచులు ఓటర్ల ముందు మోకరిల్లనున్నాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి, ప్రలోభాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది.

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్

— నిప్పు రాజేస్తున్న బీఆర్ఎస్

— తెలంగాణపై ఆంధ్ర పెత్తనం అంటూ నేతల ఆగ్రహం

— కాంగ్రెస్ కు షర్మిల బేషరతు మద్దతు

— రాష్ట్రంలో జట్టు కట్టిన బిజెపి జనసేన
— టిఆర్ఎస్ ను వణికిస్తున్న ఆంధ్ర ఓటర్లు

కే .అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయం రంజుగా మారుతుంది.. ఇప్పటివరకు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పెట్టి అభివృద్ధి జపం చేస్తూ ఓట్లు అడుగుతోంది… తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, తన రాజకీయ పంథాను మార్చి సెంటిమెంట్ వైపు అడుగులు వేస్తుంది.. తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ పదాన్ని మార్చి వేసి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసింది.. తమ పార్టీ జెండాలో తెలంగాణ పటం లేకుండా చేసింది. ఇక రాష్ట్రం వచ్చేసింది కదా అంటూ పార్టీని కూడా భారతదేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని తలంపుతో బి ఆర్ ఎస్ గా అవతరించింది.. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మళ్లుతున్నారని, మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలింపజేసి మరో మారు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు విస్తృతం చేసింది.. ఇప్పటికే , రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా బీఆర్ఎస్ నేతలు తమ ప్రచార పర్వంలో తెలంగాణ సెంటిమెంటును మరో మారు తెరపైకి తెస్తున్నారు…’ ఆంధ్ర వాళ్ళంతా” మళ్లీ తెలంగాణ పై పెత్తనం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, దీనిని తిప్పి కొట్టాలని ఆ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు.. తాజాగా మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, కెటి రామారావు, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలంగాణ సెంటిమెంట్ డైలాగులను వదులుతూ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారు.. అధికారం కైవసం చేసుకోవడం కోసం తెలంగాణలో సెటిలైన ఆంధ్ర ఓటర్లు తమకు ఎక్కడ వ్యతిరేకంగా ఓటు వేస్తారో అని భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి..

కాంగ్రెస్ కు షర్మిల మద్దతు:

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటుంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సందర్భంగా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వైసిపి అసెంబ్లీ ఎన్నికల రంగం నుంచి తప్పుకుంది ..అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు .. అలాగే, టిడిపి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది … దాదాపు ఆ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం వల్ల వారంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ కి భయం పట్టుకుంది.. దీంతో మరోమారు తెలంగాణ సెంటిమెంటును లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా వాళ్లతో చేతులు కలుపుతుందని ఆరోపిస్తున్నారు.. ఏదైనా పొరపాటు జరిగితే, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో భయపెట్టే విధంగా చేస్తున్నారు. ..

అలాగే బిజెపి కూడా జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ కు వేసే ఓట్లను సైతం జనసేన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… దీనిపై అధికార పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు… అంటే , మరో మారు తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలని ముందస్తుగా పిలుపునిస్తున్నట్లు అర్థమవుతుంది…

ఆంధ్రా వాళ్లపై కేటీఆర్ ఫైర్:

ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో సెటిల్ అయిన వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.. మంత్రి కేటీఆర్ వాటిని వ్యతిరేకిస్తూ చులకనగా మాట్లాడారు.. ఆంధ్రావాళ్లు ఏదైనా చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్లి చేసుకోవాలని
హుంకరించారు.. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సెటిలైన ఆంధ్ర ప్రజలు ఈసారి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారు.. దీనిని గమనించిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టు పై కొంత సానుకూలంగా మాట్లాడారు.. అలాగే, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.. ఎందుకంటే, అక్కడ ఉన్న ఖమ్మ సామాజిక ఓట్లను కొల్లగొట్టడం కోసం, మంత్రి కేటీఆర్ సైతం, ఖమ్మం జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టిడిపికి అనుకూలంగా మాట్లాడారు.. ఇలా అన్ని రకాలుగా తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ, వారు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.. పైగా, టిడిపి, వైఎస్ఆర్ షర్మిల పార్టీ 100 శాతం కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ ఉండడంతో, మరోమారు బీఆర్ఎస్ పార్టీ నేతలు “తెలంగాణ సెంటిమెంట్” ను తెరపైకి తెస్తున్నారు.. .కాంగ్రెస్ పార్టీతో ఆంధ్ర పార్టీలు “మిలాకత్” అయ్యాయని ఆరోపిస్తున్నారు… ఏదేమైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఎత్తుకోక తప్పడం లేదు..

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గెలుపు గుర్రాల పేరుతో వలస వ‌చ్చిన నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏలాగైన అధికారం ద‌క్కించూ కోవాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తోంది. అందు కోసం గెలుపు గుర్రాలను త‌మ పార్టీలో చేర్చు కోవ‌టం కోసం రెడీగా ఉంది. ఏ పార్టీలో ఉన్నా.. ఆ లీడర్ గత చరిత్ర ఎలా ఉన్నా వదిలి పెట్టలేదు. ఆఫర్లు ఇచ్చింది.. వారి గొంతెమ్మ కొరిక‌ల‌ను సైతం త‌ల ఊపుతూ పార్టీలో చేర్చుకుంది. వీరిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ నేతలే. వారంద‌రిని తిరిగి సొంత గూటికి ర‌ప్పించ‌టంలో స‌క్సెస్ అయింది కాంగ్రెస్ నాయ‌క‌త్వం. అయితే వీరిలో ఎంత మంది విధేయంగా ఉంటారన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాంగ్రెస్ లో చేరిన‌వారిలో ముఖ్య నేతలు, కీలక నేతలు.. ద్వితియ శ్రేణి నేతలూ ఉన్నారు. వారందర్నీ అక్కున్న చేర్చుకొని ముఖ్య‌నేత‌లంద‌రికీ టికెట్లు ఇచ్చింది. పార్టీలో చేరగానే ఆ నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, ఎవర్ని ఎక్కడ్నుంచి బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చేయించి మరీ టికెట్లు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ కేటాయించిన టికెట్లను చూసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధిష్టానాలు ఒకింత కంగుతిన్న పరిస్థితి ఉంది. టికెట్లు ఇవ్వడమే కాదు.. కచ్చితంగా గెలిపించుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ రంగంలోకి దూకి ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరింది.

కాంగ్రెస్ రెండో జాబితాలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రానికి మునుగోడు టిక్కెట్ ఇచ్చారు. మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకు అవకాశం కల్పించారు. మైనంపల్లి హన్మంతరావు.. అత‌ని కుమారుడికి కూడ టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికీ టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరిన భువనగిరి నేత కంభం అనిల్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఆఫర్ చేసి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు. వీరిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలే. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఇప్పుడు అవకాశం కోసం వస్తే.. అంతకు మించి లీడర్లు లేరన్నట్లుగా కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోంది. ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు లాంటి ఫిరాయింపు దారులకు మొదటి జాబితాలోనే సీట్లు దక్కాయి.

జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రయత్నించారు. ఒకానొక సమయంలో టికెట్ ఆయనకే అన్న ప్రచారం చేసుకున్నారు. జడ్చర్ల ఇవ్వకపోయినా నారాయణపేట అసెంబ్లీ సీటు వస్తుందని ఎర్ర శేఖర్ భావించారు. రెండింట్లో ఆయనకు నిరాశే ఎదురైంది. జడ్చర్ల టికెట్ ను అనిరుధ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పై రగిలిపోతున్న ఎర్ర శేఖర్, పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నారు. మునుగోడు టికెట్ కోసం పాల్వాయి స్రవంతి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ ద‌క్కింది.

మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బండి రమేశ్ కు కూకట్ పల్లి సీటును ఖరారు చేసింది. వరంగల్ పశ్చిమ టికెట్ విషయంలో జంగా రాఘవరెడ్డి చివరి వరకు ప్రయత్నించినప్పటికీ…నాయిని రాజేందర్ రెడ్డికే టికెట్ దక్కింది. హుజురాబాద్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఒడితెల ప్రణవ్ కు టికెట్ ఖరారైంది.మహేశ్వరం నుంచి అనూహ్యంగా కిచ్చెన లక్ష్మారెడ్డి పేరును ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు స్థానాలను కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల సీటు ఖరారైంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ను విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు. అయితే ఈ టికెట్ అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఈ స్థానం నుంచి అజరుద్దీన్ ను బరిలోకి దించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, తన అనుచరులతో భేటీ కానున్నారు. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి టికెట్ ప్రకటనపై వడ్డేపల్లి అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుభాష్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మొదట్నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలోనే హైకమాండ్ ఉంది. మొదటి జాబితాలో కొత్త వారికి మొత్తం 12 సీట్లు వారికి దక్కగా.. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురికీ సీట్లు దక్కాయి. ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న వినయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూసుకుళ్ల రాజేష్‌రెడ్డి, సరిత, ఎ చంద్రశేఖర్‌, వేముల వీరేశం, కోట నీలిమలకు కూడా అభ్యర్థిత్వం లభించింది. రెండో జాబితాలో 15 మంది కొత్తవారికి చోటు లభించింది. ఇప్పటి వరకూ మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులకు కేటాయించిన కాంగ్రెస్.. ఇందులో 27 మంది కొత్త అభ్యర్థులే కావడం విశేషం. అయితే.. కొత్తవారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటి వరకూ పార్టీలో పాతుకుపోయిన.. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న వారికి.. యువనేతలకు టికెట్లు దక్కలేదని ఆరోపణలూ లేకపోలేదు.

తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత హోరోహోరీగా సాగబోతున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ప్ర‌చారం జోరందుకుంది. ఇలాంటి హోరాహోరీ పోరులో గుర్తించాల్సింది … కాంగ్రెస్ గెలిచే సీట్లు కాదు. గెలిచిన తర్వాత ఆ పార్టీ వైపు ఎంత మంది ఉంటారన్నది ముఖ్యం. హంగ్ అంటూ వస్తే.. కాంగ్రెస్ పార్టీ తట్టుకునే అవకాశం ఉండదని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపు గుర్రాలపేరుతో ఫిరాయించిన వాళ్లే. వారు తమకు బెస్ట్ ఆఫర్ ఏదనుకుంటే అందులోకి జంప్ చేస్తారు. ఒక‌వేళ సాధారణ మెజార్టీ వచ్చినా కూడా ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చినా కూడా తాము అడిగిన పదవులు ఇవ్వకపోతే పార్టీ ఫిరాయిస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

హంగ్ వచ్చినా.. సాధారణ మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేల్ని నిలుపుకోవడం అసాధారణమైన పని అవుతుంది. విధేయులకు టిక్కెట్లు ఇప్పించి గెలిపిచుకుంటే.. ఇంతలా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సీజన్ల వారీగా పార్టీలు మారేవారిని బలమైన నేతల పేరుతో తెచ్చి పెట్టుకుని టిక్కెట్లు ఇస్తూండటంతోనే ఈ భయం పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష మెజార్టీ సాధించడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. అసలు సమస్య అక్కడే వస్తుంది. గెలుపు గుర్రాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. వారంతా అధికారం, పదవుల లక్ష్యంతోనే వచ్చారు. వారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ప్యారాచూట్ నేతలతో కాంగ్రెస్ పార్టీ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో ఎంత మందిని తమ కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారనేది అస‌లు స‌మ‌స్య‌. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది పేరుతో గెలిచిన వారు అధికార పార్టీలోకి జంప్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. సీట్లు గెల‌వ‌డ‌మే కాదు గెలిచిన నేత‌ల‌ను కాపాడుకోవ‌డ‌మే పార్టీకి పెద్ద సవాల్ గా మారనుంది.

తగాదాల ఎన్ టీవీ

బీఆర్ఎస్ వంత పాడే చర్చలేంటి..?

— బహిరంగ చర్చలకు అనుమతి ఎవరిచ్చారు..?
— జర్నలిజం అంటే మీ జేబు సొత్తా..?

— బహిరంగ చర్చలకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉందా..?

– టిఆర్పి ల కోసం ఎంతకైనా తెగిస్తారా…?

– ఇదే నా..? నెంబర్ నెం. 1 అంటే…?
జరుగరాని అనర్ధం జరిగితే కారకులు ఎవరు..?

శిక్ష ఎవరికి వేయాలి…?

— సమన్వయ చర్చలు ఎవరి ప్రాపకం కోసం..?

— బహిరంగ చర్చ లను ఈసీ నిషేధించాలి..

— నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి..

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ : 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా, హైదరాబాద్ :

రోజురోజుకు ఎలక్ట్రానిక్ మీడియా పోకడలు పెచ్చు మీరిపోతున్నాయి…” బ్రాండ్ నేమ్” కోసం టిఆర్పి రేటింగ్ ల కోసం, వింత పోకడలతో సభ్య సమాజం ఏవగించుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించడం సిగ్గుమాలిన చర్యగా ఉంది … టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానం అంటూ ఉదరగొడుతున్న ఎన్ టివి ఛానల్ తగాదాలకు నిలయంగా మారింది… తన స్వార్ధ ప్రయోజనం కోసం, తన బ్రాండ్ ను ప్రజల్లో పెట్టడం కోసం, వింత పోకడలతో జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీకి కొమ్ముకాస్తుంది… ఇందులో భాగంగా ఈ ఎన్నికల సమయంలో “గెలుపు ఎవరిది” అనే టాగ్ లైన్ తో బహిరంగ చర్చలను పెట్టి పెద్ద దుమారమే రేపుతుంది… అయితే ఈ బహిరంగ చర్చలకు ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ ఉందా..? నేనే నెంబర్ -1 అని మీడియా ముసుగులో అజమాయిషి చెలయిస్తూ… ఈ బహిరంగ చర్చలను ఎందుకు పెట్టినట్లు…? ఎవరికోసం పెట్టినట్లు..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి… ప్రధానంగా ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి, వ్యక్తిగత విమర్శలకు ఉసిగొలిపి ఎవరిని ఉద్ధరిద్దామని, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..? అనే ప్రశ్నలు కోకొల్లులు … అధికార బీఆర్ఎస్ పార్టీకి వంతపడే విధంగా ఎన్టీవీ నిర్వహిస్తున్న “గెలుపు ఎవరిది” అనే ప్రోగ్రాం బహిరంగ చర్చ లు రసాభాసగా మారుతున్నాయి..

. ఇటీవల ఎల్బీనగర్ లో నిర్వహించిన బహిరంగ సభతో పాటు, తాజాగా కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ చర్చలు రసాభాసగా మారాయి. రాజకీయ పార్టీల నాయకులు వేదికపైనే తన్నుకున్న దృశ్యాలు చూసాం. బహిరంగ చర్చలో తన్నులాటకు తెరవేసిన ఎన్టీవీ సమన్వయకర్తలు లోపభూయిష్టంగా కార్యక్రమాన్ని నిర్వహించారా..? లేక అధికార పార్టీకి వంత పాడే విధంగా ఈ చర్చలను కొనసాగిస్తున్నారా..? అంటే, అవుననే సమాధానం వస్తుంది.. రెండు చోట్ల నిర్వహించిన బహిరంగ చర్చలలో అధికార పార్టీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, వారిని హైప్ చేసే విధంగా చేయడం ప్రజలు గమనిస్తున్నారని ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం…

నాయకుల తన్నులాట:

తాజాగా కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన ఎన్ టీవీ బహిరంగ చర్చలో అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేశారు… వందలాది మంది చూస్తుండగానే వేదికపై ఉన్న శ్రీశైలం గౌడ్ ను పరుష పదజాలం ఉపయోగిస్తూ, గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.. వెంటనే సభ సమావేశానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక పైకి వెళ్లి గందరగోళం సృష్టించారు… వెంటనే నిర్వాహకులు బహిరంగ చర్చను ముగించేసి జారుకున్నారు ..

అక్రమ బహిరంగ చర్చలు నిషేధించాలి:

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే తమ ప్రచార బహిరంగ సభలకు ఈసీ నుంచి అనుమతి తీసుకుంటారు… కానీ , ఇక్కడ మీడియా ముసుగులో ఎవరి అనుమతి తీసుకోకుండానే, ఇలాంటి బహిరంగ చర్చలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు … ఈ సభలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది …ఇలాంటి విచ్చలవిడి బహిరంగ సభలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

గెలుపెవరిది “చర్చలకు అర్థం ఏంటి..?

ఎన్టీవీ నిర్వహిస్తున్న “గెలుపు ఎవరిది” అనే చర్చలకు అర్థం ఏంటి..? ఈ ట్యాగ్ లైన్ ద్వారా పెడుతున్న చర్చలు ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తోంది..? ఈ చర్చల ప్రధాన ఉద్దేశం ఏంటి.? మీరు పెట్టుకున్న టాగ్ లైన్ పై ఏమైనా చర్చలు చేస్తున్నారా..? అసలు ఈ చర్చల్లో “గెలుపు ఎవరిది” అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? ఈ హక్కు మీకు ఎవరిచ్చారు .? అసలు జర్నలిజం నీ జేబులో ఉన్న బ్రహ్మస్త్రమా.? ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా పడితే, అలా, ఉపయోగించి మీ స్వప్రయోజనాలను తీర్చుకుంటారా…? ఇదేమి జర్నలిజం.? ఇదేమి బహిరంగ సభలు.. అంటే, మీరు రాజకీయ పార్టీలను తెర వెనుక నుండి నడిపిస్తున్నారా..? ఏ మెసేజ్ ని ప్రజలకు అందిస్తున్నారు..? అనేది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలతో కూడిన, స్వార్థ ప్రయోజనం తో కూడిన బహిరంగ చర్చలకు స్వస్తి పలకాలి.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు..? సమస్యలు ఎలా ఉన్నాయి..? అనే దానిపైన విజువల్స్ తో సహా ప్రజా బహుళయంలో పెట్టాలి … అప్పుడే కదా, నిజమైన జర్నలిజానికి అర్థం … మరి మీరు చేస్తున్నది ఏంటి.? ఇలాంటి జర్నలిజం వల్ల మొత్తం సమాజం వివగించుకునే పరిస్థితి వస్తుంది.. దీనివల్ల ఎవరికి లాభం.. ? ఎవరికి నష్టం..? అనేదానిని స్పష్టం చేయాల్సిన అవసరం నిర్వాహకులపై ఉంది.

ఎమ్మెల్యే వివేకానంద పై కేసు :

ఎన్టీవీ నిర్వహించిన బహిరంగ చర్చలో భాగంగా ఎమ్మెల్యే వివేకానంద బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన విషయంపై బిజెపి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. అలాగే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని బిజెపి నేతలు ప్రకటించారు… అలాగే ఈ దాడికి సంబంధించి సంపూర్ణమైన ఆడియో, వీడియో సిడిలను అందజేస్తామని నాయకులు తెలిపారు..

ఈ నెల 15 న బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈనెల 15 న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండి పడ్డారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ ఉంటారని, మాటలు, మూటలు, ముఠాలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరని విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ కు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదన్నారు.

2004 లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందన్నారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాల్లో, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతని, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు.

వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందని వెల్లడించారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ అభివృద్ధిలో కిందకి పడిపోతుందన్నారు.హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने तेलंगाना विधानसभा चुनाव की पृष्ठभूमि में गठबंधन के संबंध में महत्वपूर्ण टिप्पणियां कीं। . गठबंधन पर बातचीत चल रही है. उन्होंने मीडिया से उम्मीदवारों के चयन से जुड़ी खबरों पर थोड़ा संयम बरतने को कहा. उन्होंने कहा कि उम्मीदवारों के चयन की प्रक्रिया चल रही है. रेवंत ने कहा कि उनकी पार्टी की एक नीति है और सभी पहलुओं पर विचार करने के बाद ही उम्मीदवार को अंतिम रूप दिया जाएगा
उन्होंने कहा कि चुनाव के मद्देनजर ही विधायक टिकटों को लेकर फैसला लिया जा रहा है. उन्होंने कहा, लेकिन अभी भी एमपी, एमएलसी और अन्य पदों के लिए… उनकी पार्टी के नेताओं के लिए कई अवसर हैं। उन्होंने आश्वासन दिया कि जिन लोगों ने पार्टी के लिए काम किया है उन्हें उचित मान्यता मिलेगी।
कुछ अधिकारियों पर सत्ताधारी दल के लिए काम करने का आरोप है. उन्होंने कहा कि उन्होंने बीआरएस समर्थक अधिकारियों का विवरण इकट्ठा करने के लिए एक समिति नियुक्त की है। उन्होंने चेतावनी दी कि अगर कांग्रेस पार्टी के खिलाफ झूठी खबर लिखी गई तो उचित कार्रवाई की जाएगी. संहिता लागू होने के बाद मतदाताओं को धनराशि जारी नहीं की जानी चाहिए। रेवंत रेड्डी ने आरोप लगाया कि कई अधिकारी सत्ता का दुरुपयोग कर रहे हैं.

 తెలంగాణ   అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం తో  రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాభి వనం లో  జోష్ పెంచేందుకు  మంత్రి కే టి. రామ రావు శనివారం కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో విపక్ష పార్టీ ల పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు . ఇక అక్కడినుండి ఎన్నికల బరిలో ఉన్న నాయకుల నుండి అదే   స్టైల్ లో రియాక్షన్ వచ్చింది. అప్పట్లో  కల్వ కుర్తి  లో ఎన్ టి రామారావు ను ఓడించి చరిత్ర సృష్టించినట్లే   ముఖ్య మంత్రి  కే. సి. ఆర్ ను ఓడించి చరిత్ర సృష్టిస్తామని ,కామారెడ్డి ప్రజలు కొత్త చరిత్ర రాస్తారని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు 

గజ్వేల్ లో తేల్చుకుందాం

గజ్వేల్‌ అభివృద్ధి నమూనాగా కామారెడ్డిని ప్రగతి పథంలో నడిపిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. అక్కడ అభివృద్ధి ఏమోగానీ వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపిస్తానంటూ బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్‌ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. కార్యక్రమానికి ఒకరోజు ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి చలో గజ్వేల్‌ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నేత షబ్బీర్‌అలీ ఇటీవల వాహనాల్లో గజ్వేల్‌కు తరలివెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇలా కేసీఆర్‌ ప్రత్యర్థులిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు నేతలు నిత్యం జనంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.

నా పేరు పలకాలంటేనే కేటీఆర్ భయపడుతున్నాడు ..షబ్బీర్ అలీ

మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలపై అటు షబ్బీర్‌ అలీ, ఇటు వెంకటరమణారెడ్డి ఎదురుదాడికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

   లంచాలు తీసుకొని ,కమిషణులకు కక్కుర్తి   పడి  బలహీన వర్గాల కోసం  నిర్మించిన  బెడ్‌రూం ఇళ్లను నాసిరకంగా నిర్మించారని  షబ్బీర్ అలీ ఆరోపించారు. దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతలు రూ. మూడు లక్షల చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని ఆయన  విమర్శలు గుప్పించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేశాయని, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్‌ఎస్‌ నాయకుడికి బీఫామ్‌ ఇచ్చి తనను ఓడించే కుట్ర చేశారని  షబ్బీర్ అలీ ఆరోపించారు.

 మంత్రి కే టి ఆర్  విమర్శలపై బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానన్నారు. సీఎం గజ్వేల్‌ను పూర్తిగా వదిలేసి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను ఓడించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.  ఎంతో మంది అమర వీరుల త్యాగం తో ఏర్పడిన  తెలంగాణ ఏర్పడిందని  షబ్బీర్ అలీ అన్నారు . సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన కే సి ఆర్  ఆ తర్వాత వెన్ను పోటు పొడిచారని ఆయన అన్నారు . కామ రెడ్డి బీఆర్‌ఎస్‌ సభా వేదికపై ఉద్యమకారుడొక్కరూ  లేరని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు .

మంత్రి కేటీఆర్‌కు కనీసం  తన పేరు ఉచ్చరించడం కూడా రాలేదని షబ్బీర్ అలీ మంది పడ్డారు ., ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి జీవితంలో మరిచిపోలేని దెబ్బకొడతానని పేర్కొన్నారు. ఇలా కేటీఆర్‌ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎదురు దాడికి దిగడంతో  రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే దాదాపు 200 ల మంది సీనియర్ జర్నలిస్ట్ లు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు . వారంతా కామ రెడ్డి లో నామినేషన్  దేశం లో ప్రత్యేక  సంతరించుకొన అవకాశం ఉంది 

మేడ్చల్ బరిలో ఈటెల

-–-హుజరాబాద్ లో జమున రెడ్డి

–గెలుపు లక్ష్యంగా బిజెపి పావులు

(ఏ ఆర్ మీడియా) హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీనియర్ నేతలు అంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల సతీమణి జమునా రెడ్డి పోటీ చేసేందుకు కుటుంబ పరంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా ,పార్టీ అధిష్టాన వర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. అయితే ,రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

మేడ్చల్ లో రసవత్తర పోటీ:

మేడ్చల్ నియోజకవర్గం లో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది .. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే, సిహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు ..   తాజాగా ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గంలో పోటీ  చేయాలని నిర్ణయ తీసుకున్నారు. .    మంత్రి మల్లా రెడ్డి, ఈటెల ఇద్దరు ఆర్ఫికంగా  బలమైన వారు కావడం వల్ల పెద్ద ఎత్తున “నువ్వా , నేనా” అన్నట్లుగా పోటీ నెలకొనే అవకాశం ఉంది.  మేడ్చల్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ తన సొంత క్యాడర్ తోఎన్నికలను ఎదుర్కోవడానికిసిద్ధమవుతున్నారు. పైగా, ఇదే నియోజకవర్గంలో తన నివాసం కూడా ఉండటం వల్ల ఈటెల రాజేందర్ స్థానికుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ,రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. ఎలాగైనా మేడ్చల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రంగం సిద్ధమైంది

హుజురాబాద్ లో ఈటల జమునా రెడ్డి..

హుజురాబాద్ లో కూడా గెలుపే లక్ష్యం:
హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ సతీమణి జమునా రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .. అయితే, హుజరాబాద్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న రాజేందర్ కు అక్కడ గెలవడం సునయాసమే… అందుకోసమే అక్కడి నుంచి ఆయన సతీమణి జమునా రెడ్డిని రంగంలోకి దింపి గెలిపించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది … ఇప్పటివరకు ఈటెల రాజేందర్ తన రాజకీయ జీవితంలో హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో ఓటమి ఎరగని నాయకుడిగా రాష్ట్రస్థాయి నాయకుడుగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఆయన కుటుంబానికి తిరుగులేని ప్రజాభిమానం సొంతమైంది.. ఒకే కుటుంబంలో ని భార్య భర్తలు వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

తెలంగాణలో  సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ  కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్,బి. జె. పి. బి ఆర్ ఎస్ పార్టీ లు అధికారం లోకి రావడానికి సర్వ శక్తులు వడ్డుతున్నాయి .

సర్వ శక్తులు  ఒడ్డుతున్న బి.ఆర్.ఎస్ 

ఈ  ఎన్నికల రేసు లో  రెండు టర్మ్స్ లు అధికారంలో ఉన్న బి.ఆర్ఎస్ పార్టీ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడానికి సర్వ శక్తులు  ధార పోస్తోంది .  ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు అందరికంటే ముందుగా ఎన్నికల రేసులో    తమ గెలుపు గుర్రాలను  ప్రకటించారు.  . తమ పార్టీ లో ఉన్న క్యాడర్ జారిపోకుండా  ప్రయత్నిస్తూనే వివిధ పార్టీ లకు చెందిన నాయకులను, క్యాడర్ ను  తవైపు తిప్పుకునేందుకు సర్వ శక్తులు.ధారపోస్తున్నారు.. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ గనుక పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ప్రసన్న చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

.2014 ఎన్నికలు పూర్తి గా సెంటిమెంట్ తో కూడుకున్నాయి కావడం తో ఓటర్లు సహజంగానే తెలంగాణ సెంటీమేట్ కు పట్టం కట్టారు.  ఇక 2018  ఎన్నికలు వచ్చేసరికి బి ఆర్ ఎస్ తన వ్యూహాన్ని మార్చేసింది . కొన్ని రోజుల్లో ఎన్నికలకు వెళ్తాం అనే ముందు   రైతు బంధు వంటి స్కీమ్ తీసుకు రావడం దాని తో పాటు  వృద్దులకు,అంగవైకల్యం, ఒంటరి మహిళలకు,పెన్షన్ లు  పెంచుతూ కొత్త పెన్షనులు  ఇవ్వడం ,కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణం తో పలు జల వనరుల ను పెంచే ప్రాజెక్టు లు నిర్మించడం ఆ పార్టీ కి బాగా కలిసివచ్చింది . ఆ ఎన్నికల్లో తెలంగాణ నినాదాన్ని కే సి ఆర్ కొత్త రూపం లో ఎత్తుకోవడం ఆయన కు బాగా  నాయుడు కాంగ్రెస్స్ తో జత కట్టడం ఇష్టం లేని వర్గాలకు కెసిఆర్ మాటలు నిజమే అనిపించాయి.

ఎప్పటినుండో కాంగ్రెస్స్ ఓటు వేస్తున్న వర్గాలు కూడా కాంగ్రెస్స్ కూతమిని వ్యతిరికించాయి .    చంద్ర బాబు నాయుడుకి  తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని మరో సారి తెలంగాణ  సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చింది . టి ఆర్ ఎస్ పార్టీ  బీఆర్ఎస్ పార్టీ గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాదని తేలిపోవడం తో బి ఆర్ ఎస్ అధినేత  తన రూటను మార్చారు  .  ఈ  ఎన్నికల్లో   ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడానికి అభివృద్ది,సంక్షేమ  పదకాలతో కే సి ఆర్ ముందుకు వెళ్తున్నారు 

బి.ఆర్.ఎస్ దీటుగా కాంగ్రెస్ వ్యూహాలు..

 ప్రత్యేక తెలంగా రాస్తాన్ని ఇచ్చింది కాంగ్రెస్స్  పార్టీయే   ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ  స్టేట్  లో  పార్టీ ని నడిపించే  శక్తి లేకపోవడం తో దాదాపు దశాబ్ది కాలం నుండి అధికారానికి  దూరంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్స్ పార్టీ నుండి  విజయం సాదించిన ప్రజా ప్రతినిదులు పార్టీ ని విడిచిపెట్టి బి ఆర్ ఎస్ కు వెళ్ళిపోవడం మరికొంతమంది నాయకులు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ లో చేరిపోవడం తో  తెలంగాణ లో కాంగ్రెస్ బాగా బాలహీనపడింది . ఒక దశలో ఎన్నికల్లో పోటీచేయడానికి  క్యాండియట్  లు కూడా లేని పరిస్తితి ఏర్పడింది .కానీ  ప్రదేశ్ కాంగ్రెస్  కెమిటి  అద్యక్షుడిగా రేవంత్   రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ సినారియో మారిపోయింది

 ఆ పార్టీ క్యాడర్ లో  లో కొత్త జోష్ వచ్చింది . కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తో తెలంగాణలో గ్రాఫ్ అమాంతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ని విడిచి వెళ్ళిపోయిన వారితో పాటు వివిద పార్టీ ల కు చెందిన ముఖ్య  నాయకులు,పెద్ద  ఎత్తున   వచ్చి చేరుతున్నారు 

సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ BRS పార్టీని ఓడించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేసులో ముందుండగా కాంగ్రెస్ పార్టీ  వ్యూహాత్మకంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. దాన్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించింది. వర్గాలవారీగా అభ్యర్థులకు రుసుం విధించింది 119 నియోజకవర్గాల్లో మొత్తం దాదాపు 1100 అప్లికేషన్లు వచ్చాయి. నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని దానిపై వడపోత ప్రారంభించింది . కొన్నాళ్లుగా సునీల్ కనుగోలు నేతృత్వంలో అభ్యర్థుల గెలుపు ఓటమిపై విస్తృతమైన సర్వే నిర్వహిస్తున్నారు అదేవిధంగా న్యూఢిల్లీ కి చెందిన మరో రెండు సర్వే సంస్థలు లోకల్ క్యాడర్ కు సంబంధం లేకుండా నియోజకవర్గాల వారీగా సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ అంద చేస్తున్నారు .కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయిన మైనార్టీలు దళితుల ను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు పకడ్బందీ  ప్లాన్ చేస్తున్నారు

ఉద్యోగ అవకాశాలు లేని యువతను ఆకర్షించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు అదే విదంగా  గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు రైతులు, రైతు కూలీలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు కసరత్తులు చేస్తోంది . టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దీటుగా పలు పధకాలు  తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.   ఎన్నికల్లో తమ హామీలను ప్రజలకు వివరించేందుకు అగ్ర నాయకుల తో  సమావేశాలు నిర్వహించాలని రంగం   సిద్ధం చేస్తుంది. 

తెలంగాణలో   వికాసం కోసం కమలం  ఎత్తులు…

ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. ఇప్పటికే.. సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. ఈ క్రమంలోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుకు ఎటువంటి రుసుము విధించకపోవడంతో ఒక్కొక్కరు ఐదు నుంచి పది స్థానాల్లో టిక్కెట్ను ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు

  బీజేపీలో అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సంప్రదాయాన్ని అమలు చేసిన కమలం పార్టీ అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో వడపోత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్నికల్లో సీనియర్ ఎవరు దరఖాస్తు చేసుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి అప్లికేషన్ పెట్టుకున్న వారిలో ఎక్కువ శాతం గెలిచే అవకాశం లేనివారే కనిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీ ల మద్య జరిగే  ఎన్నికల యుద్దం లో అధికార పార్టీ కి అవకాశాలు అంతగా కనిపించడం లేదని పలు సర్వే సంస్థలు చెపుతున్నాయి . కాంగ్రెస్స్ పార్టీ కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . బి జె పి  బి ఆర్ ఎస్ రెండు ఒక్కటే అనే భావన సామాన్య ప్రజల్లో కూడా ఉందని అంటున్నారు . భారతీయ జనతా పార్టీ బలహీన పడడం ,చాలా కాలం నుండి రాష్టమ లో కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న తిరిగి  హస్తం తో జత కట్టడం  కాంగ్రెస్ కు  కలిసి వస్తోందని రాజకీయ పరిశీలకులు   భావిస్తున్నారు

ఉమ్మడి మహబూబ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై అదే పార్టీకి చెందిన నాయకులు తిరగబడ్డారు. నియోజక వర్గం అభివృద్ధిని పట్టించుకోని చిట్టెం రామ్మోహన్ రెడ్డి తమపై విమర్శలు చేయడాన్ని పలువురు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తప్పు పట్టారు. ఎమ్మెల్యే తమ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు గవి నోళ్ళ గోపాల్ రెడ్డి చెప్పారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటినుండి మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు. భూత్పూర్ ముంపు బాధితుల గోడును కనీసం వినే స్థాయిలో కూడా ఆయన లేడని గోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని ఆయన అన్నారు మక్తల్ కు 150 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,కోర్టు మంజూరు చూపిస్తానని హామీలు ఏమైపోయాయి అని ఆయన ప్రశ్నించారు.

 

నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ అవి ఎందుకు పని చేయడం లేదు రామ్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రామ్మోహన్ రెడ్డి అతని అనుచరులు చేస్తున్న అవినీతి ఇంత కాదని ఆయన పేరు చెప్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆయన అన్నారు. తామంతా రామ్మోహన్ రెడ్డి కంటే ముందే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, ఆయన బెదిరింపులకు భయపడే పరిస్థితిలో లేమని గోపాల్ రెడ్డి అన్నారు తామంతా ఇప్పటికీ బి ఆర్ ఎస్ సైనికులుగానే ఉన్నామని కానీ రామ్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు మొత్తం స్పష్టం చేశారు .మక్తల్ కు ఎమ్మెల్యే వల్ల చీడ పట్టిందని ఆయనను ఓడించేందుకు పార్టీలకతీతంగా అందరం ఒకటై ఓడిస్తామని గోపాల్ రెడ్డి అన్నారు

 

పొన్నంకు బిఆర్ఎస్  వల.. 

హుస్నాబాద్ లో పోటీ చేయాలంటూ ఒత్తిడి..

కాంగ్రెస్ ను చీల్చేందుకు కుట్ర..

హైదరాబాద్ (ఏఆర్ మీడియా):

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం .. అక్కడ ఆ పార్టీని గెలవనీయకుండా చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ కుట్రలకు తెర లేపింది . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే సీటు కావడం వల్ల , దాన్ని నియంత్రించేందుకు బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఉసి గొలుపుతూ హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాల్సిందిగా అంతర్గత భేరసారాలకు దిగినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాద్ సీటు గెలవడం నల్లేరు మీద నడకే.. అందుకే, దీనిపై బిఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతూ కాంగ్రెస్ పార్టీని చీల్చి , వర్గాలుగా విభజించి పబ్బం గడుపుకునేందుకు వెంపర్లాడుతుంది.

. నాన్ లోకల్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లో పోటీ చేయాలని ఊసిగొల్పుతున్నట్లు సమాచారం ..ఇప్పటికే రెండు దఫాలుగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉండటం , పైగా , ప్రభుత్వ పాలన తీరుపై విసుగెత్తిపోవటం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పేటట్లు లేవు.. బిఆర్ఎస్ పార్టీ గెలుపు పై ఆశలు వదులుకున్న సమయంలో పొన్నం ప్రభాకర్ అంది వచ్చిన ఆయుధంగా తయారయ్యారు.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇచ్చినట్లయితే బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అంచనా వేస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆయనను అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం ..

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కే మద్దతు :

హుస్నాబాద్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డికి ప్రజల్లో గట్టిపట్టు ఉంది.. ఈసారి కచ్చితంగా ప్రవీణ్ రెడ్డి కి విజయ అవకాశాలు ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి.. ఇప్పటికే , ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువ వుతున్నారు..

నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి సుపరిచిత నాయకుడు కావడం వల్ల ప్రతి గ్రామంలో ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు … ఈ విషయాన్ని తట్టుకోలేని బిఆర్ఎస్ నేతలు ఎలాగైనా ప్రవీణ్ రెడ్డిని నియంత్రించేందుకు పొన్నం ప్రభాకర్ ను రంగంలోకి దింపినట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం, స్థానిక అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు… ఏదేమైనాప్పటికీ, కాంగ్రెస్ పార్టీని చీల్చి మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కుట్రలు చేస్తుందని ప్రచారం సాగుతోంది ..

స్థానికులనే గెలిపిస్తాం :

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం లోకల్ నాయకులను గెలిపిస్తామని చెప్తున్నారు . అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రవీణ్ రెడ్డికి మంచి పేరు ఉంది.. పైగా, ముల్కనూర్ సహకార బ్యాంక్ ద్వారా స్థానిక రైతులకు రుణాలు ఇప్పించడం, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలందరికీ సహాయం చేసి, మంచి పేరు తెచ్చుకున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.. ఇలాంటి సమయంలో పార్టీ అధిష్టానం వర్గం ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. స్థానికులు కూడా లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.

తెలంగాణలో ఇప్ప‌టీకిప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విష‌యాల‌పై ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తున్న పోల్ పల్స్ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై నియోజక వర్గాల వారీగా వివరాలు అందించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు ఆ సంస్థ  పేర్కొంది . తెలంగాణ‌ సిఎం కేసిఆర్‌ పై ప్రజల్లో వ్యతిరేకత అసహనం  స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అదేవిధంగా ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాలు, నిరుద్యోగ సమస్య లతో  యువత  వ్యతిరేకంగా ఉంది. మైనార్టీ ,దళిత వర్గాల్లో  కూడా మోడీ సర్కార్ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత క‌నిపిస్తోంద‌ని స‌ర్వేలో వెల్లడించింది.. రాహుల్ గాంధీ భార‌త్ జూడో యాత్ర తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌స్ల్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్న‌ట్లు ప్రకటించింది. పోల్ పల్స్ గ్రూప్ సంస్థ అందించిన వివరాల ప్రకారం

జహీరాబాద్ ,చేవెళ్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది

. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది

.  బిఆర్ఎస్ భాగస్వామి వామ పక్షాల తో కలిసి  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం పెద్దపల్లి స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కే పరిమితం అవుతుందని తెలిపింది.

కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పడిపోనున్న‌ట్లు పోల్ పల్స్ గ్రూప్ సంస్థ స‌ర్వే రిపోర్టులో పెర్కొంది. 

పెద్దపల్లిలో బిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బిఆర్ఎస్ కి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందని పోల్ పల్స్ గ్రూప్  వెల్లడించింది

నాందేడ్ స‌భ‌కు స‌ర్వం సిద్ధం*

దారులన్నీ నాందేడ్ వైపే

గులాబీమ‌య‌మైన నాందేడ్ ప‌ట్ట‌ణం

*రేపే సీయం కేసీఆర్ స‌భ.. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం స‌ర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర‌ ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్క‌ర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మ‌హారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్య‌క్షులు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంత‌రం చెందిన త‌ర్వాత జాతీయ‌స్థాయిలో జ‌రుగుతున్న తొలి స‌భ కావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్ల‌ను చేశారు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, ష‌కీల్, టీఎస్ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు, సివిల్ స‌ప్లైస్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ రవీంద‌ర్ సింగ్, త‌దిత‌ర నేత‌లు గ‌త కొన్ని రోజులుగా ఇక్క‌డే ఉండి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గ‌త వారం రోజులుగా నాందేడ్ లో మ‌కాం వేసి ఇత‌ర నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ… అన్నీ తానై సీయం కేసీఆర్ స‌భ‌ ఏర్పాట్లలో నిమ‌గ్న‌మ‌య్యారు. స‌భ ఏర్పాట్ల‌ను చూస్తూనే… విస్తృతంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ స‌ర్పంచ్ లు, ఇత‌ర స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులను, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను క‌లుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మ‌ర‌ఠా వీధుల్లో క‌లియ తిరుగుతూ వృద్దులు, మ‌హిళ‌లు, రైతులు, యువ‌కులను ప‌ల‌క‌రిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసీఆర్ నేతృత్వంలో అమ‌ల‌వుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వివ‌రిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీయం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియ‌జేస్తున్నారు. బీఆర్ఎస్ విస్త‌ర‌ణ అవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ…. బీఆర్ఎస్ ను ఆధ‌రించాల‌ని కోరుతున్నారు.

మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌లో మ‌న‌ రాష్ట్ర స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోక‌ర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజ‌క‌వ‌ర్గాలు, కిన్వ‌ట్, ధ‌ర్మాబాద్ ప‌ట్ట‌ణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయ‌త్ న‌గ‌ర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్ర‌జ‌లు స్వ‌చ్చంద త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా స‌రిహ‌ద్దు తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గ‌లైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధ‌న్, జుక్క‌ల్ తో పాటు నిర్మ‌ల్, నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, శ్రేణులు స‌భ‌కు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పుతున్నాయి.

*స‌భ ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

మ‌హారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) సీయం కేసీఆర్ స‌భ నేప‌థ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. సభకు హాజరవుతున్న ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, టీఎస్ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి… స‌భ ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించి, ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగారు. సభా వేదిక అలంకరణ, అతిధులు, ముఖ్య నేతల సీటింగ్ పై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

 తెలంగాణ లో  కాంగ్రెస్ పార్టీ    సీనియర్  నాయకులు పార్టీ ని వదిలి పెట్టి  ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం తో చాలా మంది సీనియర్లు పార్టీ ని విడిచిపెట్టి వెళ్లి పోయారు.వారంతా రాహుల్ గాంధీ వైఫల్యాలను ఎత్తి పొడుస్తూ ఆయన వల్లనే పార్టీ విడిచి వెళ్తున్నామని  విమర్శల వర్షం గుప్పించారు.  బాగా అధికారానికి అలవాటు పడ్డ నాయకులు తమ స్వార్థం కోసం పార్టీ విడిచి వెళ్తున్నారనేది జగమెరిగిన సత్యం.ఇతర పార్టీ ల లో చేరడానికి ఎదో ఒక స్టోరీ కావాలి కనుక  వారంతా రాహుల్ గాంధీ నే టార్గెట్ గా పెట్టుకున్నారు.సరిగ్గా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టి తమకు అనుకూలంగా వుండే భారతీయ రాష్ట్ర సమితిలో లేదా భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉత్తరాది లో పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేసినట్లే ఇక్కడ పి.సి.సి.అధ్యక్షుడు రెవంత్ రెడ్డి ని టార్గెట్  చేస్తున్నారు.ఇటు రాష్టం లో కానీ  అటు కేంద్రం లో కానీ కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో  అధికారం లోకి వచ్చేందుకు అవకాశం కనిపించక పోవడం తో కొంతమంది నాయకులు  తమ రాజకీయ  భవిష్యత్తు  పై  ఆందోళనతో ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలనే ఆలోచనతో  కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టేందుకు  సందర్భం సమయం కోసం ఎదురుచూస్తున్నారు

సోషల్ మీడియాలో తమను పథకం ప్రకారం రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నారని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపిస్తున్నారు  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వ్యూహ కర్త సునీల్ ఆఫీస్ పై. దాడులు పోలీసులతో  జరిగిన సందర్భంలో ఆ విషయం బయటపడిందని వారు అంటున్నారు. దానికి కావాల్సిన సమాచారం అంతా తమ వద్ద ఉందని వారు అంటున్నారు. హైదరాబాద్ నగర సిపి ఆనంద్ తమకు అందజేశారని ఓ సీనియర్ నాయకుడు చెప్తున్నారు .

సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఉత్తమ్‌పై కూడా సునీల్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు… సీవీ ఆనంద్ మీకు ఎలా చెప్పారు ? మేముఎలా నమ్మాలి ? మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నప్పుడు మీరెక్కడ వున్నారు ? బీజేపీకి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ? మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి సీనియర్లను    సూటిగా ప్రశ్నించారు .కాంగ్రెస్  పార్టీ కి చెందిన గూడూరు నారాయణ్ రెడ్డి ని బి.జె.పి లో చేర్పించింది ఉత్తమ్ కాదా అని  వారు అంటున్నారు.

కొంత మంది నాయకులు   చాలా కాలంగా   ముఖ్య మంత్రి కే.సి.ఆర్ కు  కోవర్ట్ లు గా   ఉంటున్నారనే విమర్శలు,ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే  విదంగా    భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,. జగ్గారెడ్డి, ,దామోదరం రాజనరసింహ్మ తో పాటు  పలువురు సీనియర్   నాయకులు శని వారం భట్టి ఇంట్లో సమావేశం నిర్వహించారు. ఇటీవల AICC  ప్రకటించిిిన కార్య వర్గం లో  అంతా తెలుగు దేశం పార్టీ కి చెందిన వారే ఉన్నారని  విమర్శలు లేవనెత్తారు.ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.అయితే ఈ సమావేశం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరిద్దరే కాకుండా  పెద్ద ఎత్తున నాయకులను కార్య కర్తలను   పార్టీ మారేలా వారు  పావులను  కదుపుతున్నారని   భావిస్తున్నారు.పార్టీ కి అండగా ఉంటూ  వస్తున్న దళిత,రెడ్డి వర్గాలను తమ వైపు తిప్పుకునెందుకు  వ్యూహరచన చేస్తున్నారు.

2018 అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ను చూపిస్తూ తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకొని ఏ విదంగా అధికారం లోకి వచ్చాడో అదే ఫార్ములాను కాంగ్రెస్ సీనియర్ లు ఎంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ,తెలుగు దేశం పార్టీ మాజీ నాయకుల పేరిట కాంగ్రెస్ పార్టీ ని  ఖాళీ చేయాలని వ్యూహంలో ఉన్నట్లు కనిపోస్తోంది. పార్టీ లో అసమర్థ పి సి.సి.నాయకుడిగా ముద్ర పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా వింతగా  విచిత్రంగా

ఉందని ఆ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు  అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చేతులు ముడుచుకుని కూర్చున్న ఉత్తంకుమార్ రెడ్డి పార్టీ పరిస్థితిపై మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు మనో ధైర్యాన్ని అందించి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న రేవంత్  రెడ్డి ని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి వుందని వారు అంటున్నారు. వీరంతా రేపో మాపో బి.ఆర్.ఎస్ పార్టీ లో మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ లో  చేరే   అవకాశం లేక పోలేదని రాజా కీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని… తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు. బండి సంజయ్ బతుకమ్మను కూడా అవమానించారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని… తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీకి దైవశక్తి అవసరమని, అందుకే యాగాలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తానని… పోటీ చేయకపోతే, అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలను తాము ఎప్పుడూ తిట్టలేదని, ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని అన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో పని చేస్తారని చెప్పారు.