పర్యావరణ పరిరక్షణకు ముప్పు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రియల్ ఎస్టేట్ ఈడెన్ గార్డెన్ తపోవన్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని సోషల్ జస్టిస్ పార్టీ ఆప్ ఇండియా డిమాండ్ చేసింది .

ఈ మేరకు పార్టీ అధ్యక్షులు చామకూర రాజు జిహెచ్ఎంసి కమిషనర్ కార్యాలయంలో రెరా కార్యాలయంలో రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు .

ఈ సందర్భంగా చామకూర రాజు మాట్లాడుతూ ఎల్బీనగర్ జోన్ లోని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లో వెస్ట్రన్ కన్స్ట్రక్షన్ కంపెనీ గుర్రం గూడ రిజర్వ్ ఫారెస్ట్ కానుకొని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఈడెన్ గార్డెన్ తపోవన్ పేరిట చేపట్టిందని అందుకు జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ ముప్పు ఉండడంతో పాటు గుర్రం కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో జాతీయ పక్షులు నెమల్లు ఉన్నాయని వాటి ఆవాసానికి ప్రమాదకరంగా మారిందని అందుకే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు తక్షణమే అనుమతులు రద్దు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు .
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే నాలా మింగారంటూ భవిష్యత్తులో వర్షాలు వస్తే పలు కాలనీలో మునిగిపోయే ప్రమాదం ఉందని మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయని ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రాజెక్టును రద్దు చేయాలని వారు కోరారు

ఈ ప్రాజెక్టు ను ఆపకపోతే తమ పార్టీ తరపున ప్రజా. న్యాయ పోరాటం చేస్తామని చామకూర రాజు హెచ్చరించారు..