తెలంగాణలో ఇప్ప‌టీకిప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విష‌యాల‌పై ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తున్న పోల్ పల్స్ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై నియోజక వర్గాల వారీగా వివరాలు అందించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు ఆ సంస్థ  పేర్కొంది . తెలంగాణ‌ సిఎం కేసిఆర్‌ పై ప్రజల్లో వ్యతిరేకత అసహనం  స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అదేవిధంగా ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాలు, నిరుద్యోగ సమస్య లతో  యువత  వ్యతిరేకంగా ఉంది. మైనార్టీ ,దళిత వర్గాల్లో  కూడా మోడీ సర్కార్ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత క‌నిపిస్తోంద‌ని స‌ర్వేలో వెల్లడించింది.. రాహుల్ గాంధీ భార‌త్ జూడో యాత్ర తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌స్ల్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్న‌ట్లు ప్రకటించింది. పోల్ పల్స్ గ్రూప్ సంస్థ అందించిన వివరాల ప్రకారం

జహీరాబాద్ ,చేవెళ్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది

. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది

.  బిఆర్ఎస్ భాగస్వామి వామ పక్షాల తో కలిసి  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం పెద్దపల్లి స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కే పరిమితం అవుతుందని తెలిపింది.

కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పడిపోనున్న‌ట్లు పోల్ పల్స్ గ్రూప్ సంస్థ స‌ర్వే రిపోర్టులో పెర్కొంది. 

పెద్దపల్లిలో బిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బిఆర్ఎస్ కి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందని పోల్ పల్స్ గ్రూప్  వెల్లడించింది

ఫామ్ హౌస్ కేసులో ఆరెస్సెస్ అగ్రనేత ఇరికించి, నోటీసులివ్వడంతో కేసీఆర్‌ సర్కార్‌ తమతో పెట్టుకుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్‌ పరివార్‌ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు.

బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని… తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు. బండి సంజయ్ బతుకమ్మను కూడా అవమానించారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని… తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీకి దైవశక్తి అవసరమని, అందుకే యాగాలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తానని… పోటీ చేయకపోతే, అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలను తాము ఎప్పుడూ తిట్టలేదని, ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని అన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

T.R.S. MLC KAVITHA.WARNED B.J.P. M.P. ARAVIND..

నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి.  గురువారం ధర్మ పురి అరవింద్ నిజామాబాద్ లో మీడియా తో మాట్లాడారు, ఈ సందర్భంగా కవిత తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ,ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో  మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇదే అంశం  ప్రస్తుతం  టి.ఆర్. ఎస్, బి.జె.పి పార్టీ ల మధ్య తీవ్ర దుమారం లేపుతుంది.దీని పై తీవ్రంగా స్పందించిన కవిత నిజామాబాద్‌ మెయిన్‌ సెంటర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను  చెప్పుల తో కొడతామని హెచ్చరించారు. అరవింద్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తాను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తో మాట్లాడానని సత్య దూరమని ఆమె అన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు

.

ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అరవింద్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కనీసం ఆయన వయసుకు కూడ గౌరవం ఇవ్వకుండా , అన్ పార్లమెంటరీయన్ మాటలు మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. భవిష్యత్ లో అరవింద్ ఇలానే మాట్లాడితే తమ కార్య కర్తలు సహించరని కవిత హెచ్చరించారు.