రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బెయిల్‌ పిటిషన్‌ను  అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు వేళ బెయిల్‌ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనను తో ఏకీభవించిన  ప్రత్యేక కోర్టు   బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

స్టే విధింపు పై  హై కోర్ట్ లో   విచారణ  మంగళవారానికి  వాయిదా*

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి సీజే ధర్మాసనాన్ని శనివారం ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్టేను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని, సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని ప్రేమేందర్ తరఫు న్యాయవాది సోమవారం కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణ మంగళవారం చేపడతామని పేర్కొంది.