మోదీకి లేఖరాసిన టిడిపి పొలిటీబ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలంటూ తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.

ఏరియల్ సర్వే చేయడం ద్వారా రుషికొండ అక్రమాలు స్వయంగా వీక్షించవచ్చని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి భిన్నంగా 3 రాజధానులంటూ సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరును లేఖలో అయ్యన్న వివరించారు.

అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే స్పష్టతను ప్రధాని ఇవ్వాలని అయ్యన్న ఆకాంక్షించారు.

మూడున్నరేళ్లుగా పోలవరం పనులు జరగలేదని, ప్రధాని స్థాయిలో ఓ సమావేశం నిర్వహించి పోలవరం పూర్తయ్యేలా చూడాలని కోరారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 11,12న విశాఖ పర్యటనకు రానున్నారు.

10,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు