కృష్ణాజిల్లా పామర్రు నారాయణ విద్యాసంస్థలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది . డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుసుకోకుండా నారాయణ సంస్థ కళాశాల ఉద్యోగులు గమనించకుండా డ్రైవర్ కు బస్ అప్పగించారు

బస్ లో 40 మందిని ఎక్కించుకొని బస్ ను స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లేసరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. విజయ పామర్రు . మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి అదుపు తప్పడం తో బస్సు లో ఉన్న విద్యార్థులు భయాందోళన గురయ్యారు. వారంతా పెద్ద ఎత్తున కేకలు వేశారు .వెంటనే డ్రైవర్ బస్ ను రోడ్డుపై నిలిపి వేసాడు.ఆ పై రోడ్ మీద వెళ్లి పడుకున్నాడు.ఇంత జరిగినా యాజమాన్యం సీరియస్ గా తీసు కోవడం లేదని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.