*కర్ణాటక*:ఒకే సారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల సూసైడ్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా బరకనహాల్ తండాలో చోటుచేసుకుంది. రంజిత(24), బిందు(21), చందనలు ముగ్గురు అక్కా చెల్లెళ్లు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. వీరిని అమ్మమ్మ చూసుకుంటుంది. రంజిత, బిందు ఓ గార్మెంట్ లో పనిచేస్తుండగా చందన చదువుకుంటుంది. ఇటీవల అమ్మమ్మ కూడా మరణించడంతో తమకు ఎవరూ లేరని కుంగి పోయారు. తొమ్మది రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చిన పోలీసులు ఇంటి పై కప్పు నుంచి చూడగా ముగ్గురు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ఒకే సారి ముగ్గురు సిస్టర్స్ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.