!ఒకప్పుడు రైల్లో టి.టి ని చూసి సీట్ కింద దాచుకున్న బాలిక…. నేడు లక్షల కోట్లకు అధిపతి..

0
3

ఇది కథ కాదు… ఒక చిన్న  సహాయం ఆమె జీవితాన్నే మార్చేసింది….

ఒకసారి ముంబై నుండి బెంగుళూరు వెళ్లే రైలులో డ్యూటీలో ఉన్న TTE (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్) సీటు కింద దాక్కున్న ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. ఆమె వయస్సు 13 లేదా 14 సంవత్సరాలు. ఉంటుంది

టీటీఈ ఆ అమ్మాయిని తన టిక్కెట్టు చూపించమని అడిగాడు. ఆ అమ్మాయి తడబడుతూ తనకు టిక్కెట్టు లేదని బదులిచ్చింది.
వెంటనే రైలు దిగిపోవాలని  టీటీఈ ఆ బాలికకు చెప్పాడు.ఆ బాలిక భయం తో  వణికిపోతోంది .ఇది గమనించిన ఓ మహిళ ప్రయాణికురాలు  TTE గారు “నేను ఆమెకు డబ్బు చెల్లిస్తాను” అని చెప్పింది.  
 టికెట్ కోసం డబ్బు చెల్లించి, బాలిక ను దగ్గర గా తీసుకొని తలపై నిమురుతూ  నీ పేరు ఏమిటి అని అడిగింది. ఆ బాలిక “చిత్రా”,  అని చెప్పింది.ఆ మహిళ పెరు శ్రీమతి భట్టాచార్య ఆమె ఓ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తోంది.
“ఎక్కడికి వెళ్తున్నావ్?” అని బాలికను  అడిగింది.అమ్మ నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు.భట్టాచార్య చెమర్చిన కళ్ళతో

“అయితే నాతో రా.” అని అడిగింది.. బెంగుళూరు చేరుకున్న తర్వాత, శ్రీమతి భట్టాచార్య ఆ  బాలికను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక సురక్షితమైన ఒక  NGO సంస్థ లో చేర్పించారు. . తరువాత  వృత్తిరీత్యా  భట్టాచార్య ఢిల్లీకి  బదిలీ అయ్యారు.ఆ తర్వాత అక్కడే స్థిర పడ్డారు.  ఆ తర్వాత చిత్ర,  శ్రీ మతి బట్టా  చార్య మధ్య కమ్యూనికేషన్ గాప్ వచ్చి ఒకరినొకరు కలుసుకోక పోవడం తో వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా కట్ అయ్యాయి. 

 20 సంవత్సరాల తర్వాత, శ్రీమతి భట్టాచార్య USAలోని శాన్ ఫ్రాన్సిస్కోకు ఓ కళాశాలలో ఉపన్యాసం ఇవ్వడానికి  వెళ్లారు.

అక్కడ  ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు.   వెయిటర్ ను  బిల్లు  ఇవ్వమని  శ్రీ మతి భట్టాచార్య అడిగారు,  మేడం మీ బిల్లు  చెల్లించారు అని   వెయిటర్ వినయంగా చెప్పాడు.ఆశ్చర్య పోయిన ఆమె నా బిల్లు ఎవరు చెల్లించారు అంటూ వెనక్కి తిరిగి చూస్తే     తన భర్తతో ఉన్న స్త్రీని  నవ్వుతూ కనిపించింది. శ్రీమతి భట్టాచార్య  ఆ దంపతులను “మీరు నా బిల్లు ఎందుకు చెల్లించారు”అని  ప్రశ్నించింది

అప్పుడు ఆ మహిళ భట్టాచార్య ప్రశ్నకు సమాధానం ఇస్తూ“మేడమ్, నేను ముంబై నుండి బెంగుళూరుకు రైలు లో ప్రయాణించడానికి మీరు నాకు చెల్లించిన ఛార్జీలతో పోలిస్తే నేను చెల్లించిన బిల్లు చాలా తక్కువ. అంటూ సమాధానం ఇచ్చింది
అప్పుడు వారిద్దరి కళ్లలోంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి

“ఓ చిత్రా… నువ్వా అంటూ…!!!” శ్రీమతి భట్టాచార్య ఆశ్చర్యంగా అన్నారు

ఒకరినొకరు కౌగిలించుకుంటూ, “మేడమ్ నా పేరు ఇప్పుడు చిత్ర కాదు. నేను సుధా మూర్తి.  ఇతనే నా భర్త.. నారాయణమూర్తి” అని చెప్పింది. 

మేడం ఆశ్చర్యపోకండి. మీరు ఇన్ఫోసిస్ లిమిటెడ్ చైర్మన్ శ్రీమతి సుధా మూర్తి మరియు మల్టీ మిలియన్ ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించిన వ్యక్తి శ్రీ నారాయణ్ మూర్తి యొక్క సతీమణి అంటూ నారాయణ మూర్తి ఆమెకు వినియంగా చెప్పారు . శ్రీమతి బట్టాచార్య తాను చేసిన చిన్న సహాయానికి ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిని ఇవ్వగలిగింది అంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు.

 

 అంతేకాదు  యూకే ప్రధానమంత్రి సతీమణి ఎవరో కాదు.ఆరోజు ట్రైన్ లో టికెట్ లేకుండా ప్రయాణించిన చిత్ర  కాదు..కాదు.. ఇన్ఫోసిస్ అధినేత  సుధా మూర్తి కూతురు.  అక్షతా మూర్తి .తన భార్య తోడ్పాటు వల్లనే తాను బ్రిటిష్ ప్రధాన  మంత్రి పదవిని అధిరోహించానని రిషి సునాక్ చెప్పారంటే మనం ఆమె గొప్పతనం అర్థం చేసుకోవొచ్చు.

మనం చేసిన చిన్న సహాయం కొంత మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది .

Written BY

Raga Deepthi

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here