26.7 C
Hyderabad
Tuesday, May 28, 2024

Telangana Assembly Elections.. వేవ్ లో కొట్టుకు పోయిన చిన్న పార్టీలు..!

Must read

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి తమ సత్తా చూపించాలని ఓ పది పార్టీలు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము రేసులో ఉంటే, మిగితా పార్టీలుక‌నుమ‌రుగైతాయాని, మా ప్ర‌తాపం చూపిస్తామంటూ హంగ‌మా చేసిన పార్టీలు ప‌త్తా లేకుండ పోయాయి. ఇప్పుడు అభ్యర్థుల్ని నిలబెట్టడం కూడా కష్టంగా మారింది. పాద‌యాత్ర‌లు… తీర్థ‌యాత్ర‌లు చేసిన‌ చిన్న చిత‌క‌ పార్టీలన్నీ సైలెంట్ అయిపోయాయి. అధికార పార్టీ అంతు చూడ‌ట‌మే జీవిత‌ ల‌క్ష్యం, మా దెబ్బ‌కు కేంద్ర‌, రాష్ట్ర పార్టీలు క‌హానీలు చెప్పాయి. తొడ‌లు కొట్టి మెడ‌లు వంచుతామ‌ని హడావుడి చేశాయి. అలాంటి పార్టీలన్నీ ఇప్పుడు క‌నుమ‌రుగైయ్యాయి.

తెలంగాణ‌లో కొత్త‌గా పార్టీలు పెట్టిన వారేమి అనామ‌కులు కారు. రాజ‌కీయ వార‌సత్వం, జ‌నాల్లో మంచి గుర్తింపు ఉన్న వారే. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చాలా పార్టీలు చేతులెత్తేశాయి. తెలంగాణ ఏర్పడిన 2014లో జరిగిన ఎన్నికల్లో పది పార్టీలు రంగంలో నిలిచాయి. త‌మ స‌త్తా చాటుకొలేక చెతులేత్తేశాయి. కానీ ఇప్పుడు రెండు, మూడు పార్టీలలో పోటీ చేయాటానాకి అభ్యర్థులు దొర‌క‌టం లేద‌నే టాక్ ఉంది. ఒక‌వేళ పోటీ చేసిన గెల‌వ‌ట‌మే కష్టమని సర్వేలు చెబుతున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగినా .. వాటి బలం మాత్రం రోజు రోజుకు త‌గ్గిపోతోంది. ఆయా పార్టీల‌ అధ్య‌క్షులతోపాటు, అభ్యర్థుల్ని కూడా రంగంలోకి దింప‌టానికి జంకుతున్నాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా త‌యారు అయ్యిందో తెలుస్తోంది.

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెడితే తెలంగాణలో ఇంకా ఆరేడు పార్టీలు కీల‌కంగా ప‌ని చేస్తున్నాయి. కానీ ఎన్నికల టైంలో ఒక్క‌సారిగా ఆ పార్టీలు చేతులు ఎత్తేయ‌డంతో పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. సీపీఐ, సీపీఎం మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. కేసీఆర్ చివరికి హ్యాండివ్వడంతో.. కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయ్యాయి. రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. కానీ అది ఇంకా ఫైనల్ చేయలేదు. కాంగ్రెస్ కూడా హ్యాండిస్తుందేమోనని కమ్యూనిస్టు పార్టీల్లో గుబులు పుట్టుకుంది. ఈ రెండు పార్టీలకు కనీసం ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంటందని తెలుస్తోంది… కొన్ని నియోజకవర్గాల్లో మాత్ర‌మే ఉన్న ఓటు బ్యాంకు వల్ల పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు సాధించవచ్చని అనుకున్నాయి. కానీ ఎక్కడా వర్కవుట్ కావడం లేదు. కాంగ్రెస్ సీట్లు ఇస్తుందా లేదా.. ఇస్తే ఏ సీట్లు అన్నది కీలకమైన ప్రశ్నగా మారింది.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పరిస్థితి మ‌రి గోరంగా మారింది. పార్టీ పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల .. కేసీఆర్ కు తానే త‌గిన నేత‌నంటూ, ఆయ‌న చూసిన అవినీతిని బ‌య‌ట పుడ‌తానంటూ హ‌డ‌హూడి చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయాలని ప్రయత్నించింది. చివ‌రికి ఆ ప్ర‌య‌త్నం కూడ విపలమయింది. ఇప్పుడు తన పార్టీకి అభ్యర్థులు లేక తంటాలు పడుతున్నారు. తాను పోటీ చేస్తానని చెబుతున్న పాలేరు వైపేమొగ్గు చూపుతున్నారు. కాని ఇంత వరకూ పాలేరు వైపు క‌న్నేతి కూడ చూడలేదు. ఆమె పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపిన గెలుస్తార‌న్న ప‌రిస్థితి ఇప్పుడు లేదు.

మ‌రోవైపు టీడీపీ పార్టీ పూర్తిగా చేతులెత్తేసింది. పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించింది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో తెలంగాణలో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఇక జనసేన పార్టీ ఏటూ తేల్చుకోలేకుండా ఆయోమ‌యంలో ఉంది. 32 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు కానీ తర్వాత బీజేపీతో పొత్తు ప్రతిపాదనలు రావడంతో అక్కడ బ్రెక్ ప‌డింది. ఇక మాజీ ఐపీ ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్నంలో బీఎస్పీ కాస్త దూకుడుగా ముందుకు వెళ్లుతోంది. కానీ ఆ పార్టీని మాయవతి కూడా పట్టించుకోవడం లేదు. ప్రవీణ్ కుమార్ మాత్రమే ముందుండి న‌డుపుతున్నారు.. ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తో సిర్పూర్‌లో పోటీ చేస్తున్నారు. ఇతర చోట్ల అభ్యర్థులను నిలుపుతున్నారు కానీ.. వారంతా పేరుకు మాత్ర‌మే పోటీలో ఉంటారు. లెక్కలో ఆయన ఒక్కడే అభ్యర్థిగా క‌నిపిస్తున్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఈ పార్టీ మాత్ర‌మే రంగంలో పోరాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో దాదాపుగా పది పార్టీలు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం సంపాదించాయి. బీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలతో సాధారణ మెజారిటీ సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఓ స్థానం గెల్చుకున్నారు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ ఒక్కో సీటు సాదించగలిగాయి. అన్ని పార్టీలు ఓ ఫోర్స్ గా ఉన్నాయి. అప్పట్లో టీడీపీకి 15 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ పార్టీలన్నింటిలో మజ్లిస్ మాత్రమే తన పట్టు నిలుపుకుంది. పాతబస్తీ జోలికి బీఆర్ఎస్ వెళ్లకుండా.. ఇతర నియోజకవర్గాల జోలికి మజ్లిస్ రాకుండా రెండు పార్టీలు పరస్పర అంగీకారంతో పోటీ పడుతున్నాయి.

గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కోదండరాం నేతృత్వంలోని జన సమితి కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ప్రకటించి ఎన్నికల నుంచి విర‌మించుకుంది. కామెడీ చేసే కేఏ పాల్ .. ఇప్పుడు తన పార్టీ తరపున అభ్యర్థులను పెట్టాలనే ఆలోచన కూడా చేయడం లేదు. ఏపీలో ఇటీవల పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ అనే నేత బీసీవై అనే పార్టీ పెట్టారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని వార్తా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఎలా చూసినా ఇప్పుడు చిన్న పార్టీలు పూర్తిగా క‌నుమ‌రుగైయ్యాయి. వాటికి సీట్లు కాదు కదా కనీసం ఓట్లు సాధించే పరిస్థితి కూడా లేదు. ఈ సారి అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తప్ప మరో పార్టీ ప్రాతినిధ్యం దక్కించుకుంటుందని ఆశ‌లు క‌నిపించ‌టం లేదు. అందుకే ఇంత కాలం హ‌డ‌వుడీ చేసిన చిన్న పార్టీలు ఇప్పుడు గ‌ప్ చూప్ గా మారిపోయాయి.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article