నెరవేరిన విశాఖ వాసుల చిరకాల వాంచ* సింహాచలం కొండవాలు ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన*

0
3

సీఎం జగన్ కు తోడుగా దేవుని ఆశీస్సులు*

 *సింహాచలం కొండవాలు ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన*

*విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి*

విశాఖపట్నం, నవంబర్ 4: విశాఖ వాసుల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరిందని, ఇది సింహాద్రి అప్పన్న భక్తులు చిరకాల స్వప్నం అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. సింహాచలం పరిధిలోని కొండవాలు ప్రాంతం వెంకోజీపాలెం సమీపంలోని చిన్నగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు రూ 5 కోట్లు ఎంపీ నిధులతో నిర్మిస్తున్న 4.15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సింహాచలం భూముల పరిరక్షణకు, కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు సీఎం జగన్ కు తోడుగా ఉంటాయని అన్నారు. ఇది భక్తుడి యొక్క విజయమని పేర్కొన్నారు. శంకుస్థాపనతో విశాఖ శ్రీ శారదా పీఠం స్వప్నం కూడా పూర్తి కాబోతుందని అన్నారు. 575 ఎకకాలతో కూడిన సింహాచల కొండవాలు ప్రాంతం ఆక్రమణలకు గురై పవిత్రత కోల్పోతుందని, పంచ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పానని అన్నారు. ఆయన ఈ విషయం పరిష్కార బాధ్యత రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి అప్పగించారని అన్నారు. కొండ చుట్టూ రక్షణ గోడ నిర్మించి, పంచగ్రామాల ప్రజల ప్రధాన సమస్య పరిష్కరించాలని భక్తులకు గిరిప్రదక్షిణ సౌకర్యం కల్పించాలని, దేవతామూర్తుల విగ్రహాలు నెలకొల్పాలని విజయసాయి రెడ్డి సంకల్పించారని అన్నారు. ఈ కృషిలో భాగమే ఈ రక్షణ గోడ నిర్మాణ శంకుస్థాపన అని అన్నారు.

*రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం: విజయసాయి రెడ్డి*

రక్షణ గోడ నిర్మాణం త్వరతగతిన పూర్తిచేస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు.  సభను ఉద్దేశించి మాట్లాడుతూ తన ఎంపీ నిధుల నుంచి రూ.5 కోట్లు కేటాయించానని, అనకాపల్లి ఎంపీ సత్యవతి రూ 3 కోట్లు ఆమె ఎంపీ నిధుల నుంచి కేటాయించారని అన్నారు. సింహాచలం కొండవాలు రక్షణ గోడ పూర్తిస్థాయిలో నిర్మించేందుకు రూ.25 కోట్లు అవసరం ఉంటుందని అన్నారు. గతంలో నిర్మించిన రక్షణ గోడకు మరమ్మత్తులు చేపట్టాలని, ప్రస్తుతం 4.15 కిలోమీటర్ల మేర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. రక్షణ గోడ పూర్తిస్థాయిలో నిర్మాణానికి 15 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ అదేశాలమేరకు విఎంఆర్డీఏ నిర్మాణ పనులు చేపడుతుందని అన్నారు. నిర్మాణం పూర్తి చేయడానికి సీఎస్ఆర్ నిధులు సమకూర్చడం జరుగుతుందని అన్నారు.

రక్షణ గోడ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయించినందుకు విజయసాయి రెడ్డి, సత్యవతి లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, దైవ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్, టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు వివిధ కంపెనీల సీఎస్ ఆర్ నిధుల నుంచి  సమీకరిస్తామని అన్నారు.  కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షులు, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, వంశీక్రిష్ణ యాదవ్, వరుదు కళ్యాణి,  ఎమ్మెల్యేలు అదీప్ రాజు, బాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, విఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకేరాజు, బిజేపీ నేత విష్ణుకుమార్ రాజు, వైకాపా నేతలు మాజీ మంత్రి బాలరాజు, శెట్టి పాల్గున, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గంట్ల శ్రీనుబాబు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here