
శివనామస్మరణతో మారుమోగిన “సిద్ధుల గుట్ట”
-వైభవోపేతంగా గిరిప్రదక్షిణ(సప్తాహారతి)
-ఘాట్ రోడ్డు పొడవునా సెంట్రల్ లైటింగ్
-సిద్ధులగుట్టపై పూర్తి స్థాయిలో సౌకర్యాలు
-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి భక్తుల ధన్యవాదాలు
కార్తీక మాసం చివరి రోజైన మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట శివనామస్మరణతో మారుమోగింది.
వేలాది మంది భక్తులు సిద్ధులగుట్టపైకి చేరుకొని ఆ మహాదేవుడి పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్యగిరిప్రదక్షిణ(సప్తాహారతి)వైభవోపేతంగా జరిగింది. సిద్ధులగుట్ట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయించారు
. జీవన్ రెడ్డి చొరవ తీసుకొని సిద్ధులగుట్ట అభివృద్ధికి20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబుల్ లైన్ తో ఘాట్ రోడ్డు నిర్మించారు. ఆలయానికి కొత్త రథం సమకూర్చారు. ఘాట్ రోడ్ పొడవునా 40 లక్షల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి మంగళ వారం ప్రారంభించారు. సిద్ధులగుట్టపై ప్రతి సోమవారం క్రమం తప్పకుండా మూడు వేల మందికి జీవనన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా భోజన వసతి కలిపించారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా బాత్ రూములు నిర్మించారుసిద్ధులగుట్టపై పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలిపించి ఎంతో ఘనంగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భక్తులు ధన్యవాదాలు తెలిపారు.