శాసనసభ మూవీ ట్రైలర్ లాంచ్ కు మంత్రి కమలాకర్ ను ఆహ్వానించిన హీరో ఇంద్ర సేన

శాసనసభ మూవీ ట్రైలర్ లాంచ్ కు  మంత్రి కమలాకర్ ను ఆహ్వానించిన హీరో ఇంద్ర సేన

*మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజును కలిసిన హీరో ఇంద్రసేన*

*కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిబసూర్ సంగీతం అందించిన శాసనసభ మూవీ ట్రైలర్ లాంచ్ కు ఆహ్వానం*

సినీ హీరో ఇంద్రసేన ఈరోజు తన కొత్త సినిమా ‘శాసనసభ’ ట్రైలర్ లాంచ్ కు రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ని, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్లో కలిసి ఆహ్వానించారు. ఈనెల 27న మద్యాహ్నం బంజారాహిల్స్ రాడిషన్ బ్లూ హోటల్లో నిర్వహించే ట్రైలర్ లాంచ్ వేడుకలలో సినీరంగానికి చెందిన ప్రముఖులు నటకిరీటి రాజేంద్రప్రసాద్, 7/G ఫేమ్ సోనీ అగర్వాల్ తదితరులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు ఏపీ మంత్రి రోజా, ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ తదితరులు హాజరవుతున్నారని హీరో ఇంద్రసేన తెలిపారు, గతంలో సూపర్ స్కెచ్, పుత్రుడు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు ఇంద్రసేన. ‘శాసనసభ’ సినిమాకు నిర్మాత తులసిరామ్ సప్పాని, షణ్ముఖ్ సప్పాని, డైరెక్టర్ వేణు మదికంటితో పాటు ప్రతిష్టాత్మక కేజీఎఫ్ చిత్ర సంగీత దర్శకుడు రవి బసూర్ సంగీతం అందించడం విశేషం.

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *