వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ మాట్లాడక ఉండుంటే బాగుండేది ..సంజయ్ రౌత్

0
3

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోష్ వచ్చిందని శివసేన ఎంపీ సంజయ్  రౌత్  అన్నారు. ఈ యాత్ర   ప్రతిపక్షాలకు కూడా ఊపిరి వచ్చిందని కానీ వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్ల జోడవయాత్ర ఉద్దేశం పక్కదారి పట్టిందని సంజయ్ రౌత్ అన్నారు.

ఈడీ కేసులో తాను మూడు నెలపాటు జైల్లో ఉన్నానని అక్కడి జీవితం చాలా దుర్లభంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇక సామాన్యులకైతే అదో  నరకం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు .వీర సావర్కర్ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని ఆయన అన్నారు. ఈ పోరాటం లో బ్రిటీష్ పాలకులు సావర్కర్ ను దాదాపు పది సంవత్సరాలపాటు అండమాన్ నికోబార్ జైల్లో  ఉంచిన  విషయాన్ని సంజయ్ రౌత్ శివసేన సామ్నా పత్రికలో వెల్లడించారు సమయం సందర్భం లేకుండా రాహుల్ గాంధీ  మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. సావర్కర్ కు బ్రిటిష్  వారిని క్షమాభిక్ష కోరడం రాజీ పడటం  అనుకోలేమని స్వాతంత్రం కోసం జైలు నుంచి బయటపడడానికి ఆయన వేసిన ఎత్తుగడగా ఉండొచ్చని సంజయ్ రౌత్  అన్నారు. మహాత్మా గాంధీ కూడా  వీర సావర్కర్ ను విడుదల చేయాలని కొరిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. ఈడి దర్యాప్తు సంస్థను భారతీయ జనతా పార్టీ తన జేబు సంస్థ గా  మార్చుకొని ప్రతిపక్ష పార్టీ  నాయకులను భయ పెడుయుండని రౌత్ ధ్వజమెత్తారు. కొంతమంది నాయకులు భయపడి   బిజెపి పార్టీలో చేరుతున్నారని నిజంగా  అలాంటి వారు  విశ్వాసఘాతకులని సంజయ్ రౌత్ అభివర్ణించారు .జోడోయాత్ర ద్వారా  రాహుల్ గాంధీ అన్ని వర్గాలను కలుపుకోవాలని రౌతు కోరారు

.కంట్రోవర్సీలకు పోకుండా ప్రజా సమస్యల పై కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాలని సంజయ్ రౌత్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here