
అందాల తార సమంత దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్ . విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న ఆమెకు సినీ రంగంలో ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రముఖ హీరో, నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగార్జున కొడుకు నాగచైతన్యను ఆమె పెళ్లి చేసుకుంది,. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరు విడి పోయారుసమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ ఆనంద సమయంలో ఆమె వింత రకమైన వ్యాధితో బాధపడుతుంది .మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత పిక్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వ్యాధితో తాను పడుతున్న ఆరోగ్య ఇబ్బందుల గురించి తెలియజేసింది అయితే తన ఆరోగ్య సమస్య ఇబ్బందికరంగా ఉన్న సినిమా ప్రమోషన్ కు హాజరవుతున్నట్లు సమంత ప్రకటించింది
తమ స్నేహితులు ఇతరులు ఇస్తున్న మనోధైర్యమే తనను ముందుకు నడిపిస్తుందని ఆమె తెలిపారు తనకున్న వ్యాధితో ధైర్యంగా పోరాడుతున్నాను అందుకే ధైర్యంగా అందరి ముందుకు వస్తున్నాను అంటూ సమంత ట్విట్టర్లో తెలిపారు
యశోద’ సినిమా ప్రమోషన్ లో భాగంగా యాంకర్ సుమ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించింది తన ఆరోగ్యానికి సంబంధించిన రూమర్స్‌పై కూడా సమంత రియాక్ట్ అయింది.
మీరు సోషల్ మీడియా వేదికగా.. మీకు వచ్చిన అనారోగ్యం గురించి తెలిపారు. నిజంగా మీకు ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘. . మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా.. మరొక రోజు మరోలా ఉంటుంది. నాకు ఒక్కో రోజు.. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇంత దూరం వచ్చానా? అని అనిపిస్తుంది. కానీ యుద్ధం చేయాలి. నేనొక్కదానినే కాదు.. బయట ఎంతో మంది జీవితం కోసం యుద్ధం చేస్తున్నారు. చివరికి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నేను చాలా ఆర్టికల్స్ చూశాను.. నాకున్న వ్యాధి చాలా ప్రాణాంతకరమైన వ్యాధి అని రాశారు. కానీ ప్రస్తుతం నేనున్న స్టేజ్‌లో అది ప్రాణాంతకమైనది మాత్రం కాదు.
ప్రస్తుతానికైతే నేను చావలేదు. శీర్షికలు పెట్టాల్సిన అవసరం లేదు అలా అని నా ఆరోగ్యం బాగుందని చెప్పలేను.ఒక సారి అడుగు కూడా వేయలేను.
ఇబ్బంది మాత్రం ఉంది.. నేను ఇంకా నాకున్న జబ్బు తో పోరాటం చేస్తూనే ఉన్నా …. పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని సమంత అన్నారు.