రమణాశ్రమములో రాత్రిళ్లు స్త్రీలు ఉండరాదనే నియమం ఒకటి ఉన్నది . ఒక విదేశీయురాలు ఒళ్లు తెలియని తీవ్ర జ్వరంతో బాధపడుతూ , ఆశ్రమం గదిలో పడుకొని ఉన్నది .రమణులు ఈ విషయం విని ” రాత్రిళ్లు స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదు అనే నియమం పెట్టారు కదా ఆవిడను తక్షణం బయటికి పంపించి వేయండి ” అని తీవ్ర స్వరంతో అన్నారు . కరుణామయులైన రమణులు అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాక , భక్తులు బాధపడ్డారు కాని , మహర్షి ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేక ఆవిడను బలవంతంగా గుఱ్ఱపు బండి ఎక్కించి , ఆశ్రమం నుండి బయటకు పంపించివేశారు. ఆశ్చర్యాలకే ఆశ్చర్యం ! ఆవిడ గుఱ్ఱపు బండి ఎక్కినప్పటి నుంచి జ్వరం క్రమేపీ తగ్గటం మొదలు పెట్టింది . ఆవిడ తన గది చేరేసరికి జ్వరం పూర్తిగా తగ్గిపోయి పైగా ఆవిడ మామూలు మనిషి అయ్యింది . ఆమె మరునాడు ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆనంద భాష్పాలతో రమణులకు నమస్కరించి ,
” మహాప్రభో ! మీ ఆగ్రహమేదో , అనుగ్రహమేదో మాలాంటి అజ్ఞానులకు ఎలా తెలుస్తుంది స్వామీ ” అని అన్నది . భగవాన్ ఎప్పటివలె తన సహజ మౌనంలో నిష్టులయ్యారు