TT Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారా..? తమిళనాడు లో ప్రస్తుత. రాజకీయ పరిస్థితులు రజినీకాంత్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న రజినీకాంత్ ఇటీవల పలువురు బిజెపి నాయకులను కలుస్తున్నారు .కేంద్ర గృహ శాఖ మంత్రి అమిత్ షాను కలవడం ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకొని ఏకంగా పాదాభివందనమే చేశారు. తాజాగా జార్ఖండ్ ,తమిళనాడు, గవర్నర్లను కలవడం చర్చనీ అంశమైంది .ఈ అంశంపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ మాట్లాడారు తాము ఎటువంటి పదవులు ఆశించడం లేదని అంటూనే ఒకవేళ భగవంతుడు కరుణిస్తే ఏదైనా పదవి స్వీకరించడానికి రజినీకాంత్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు సో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే రజనీకాంత్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *